కొత్త ఆవకాయ
శీర్షిక మీరు జాల గలరా, నారుచులను!?
"ఆంధ్ర" అన్న మాటలో
మొదటి స్వరము వచ్చి
ఆ వకాయలో
చేసినది పరకాయ ప్రవేశము.
ఇంత ప్రపంచముండగా,
సుంతైనా తోచలేదు ఎవ్వరికి
ఆంధ్రుల తలకాయ
ఊరగాయలకు ఊటబావి.
ఆ మ్ర అనోకహము(చెట్టు)
ఆ వకాయకు
ఆత్మ బంధువయ్యే
ఆవాలు అసలు సిసలు ఆధారము కాగా
ఇన్ని ఆ ల అనుషంగము(సంబంధము)
ఆవకాయ రుచికి మూల బంధమయ్యే
అన్నట్లు మరికొన్ని ఆ. లున్నవి
అవి అతి ముఖ్యమైనవి
ఆం ధ్రుల
ఆ డబడుచుల
ఆ దరణే
ఆ వకాయ
ఆ విర్భావానికి
ఆ ది గురువు.
ఆమోఘమైన ఆవకాయ తిని,
దాని రుచి గూర్చి చెప్పెడి
ఆ టవెలది నోట విందుమా మనము
ఆటవెలది
వేడి అన్న మందు వెయ్యవలయు ముక్క
చాలినంత నూనె చక్కగాను
ఆవ పిండి వేసి యన్నము తినవయ్య
అన్ని రుచులు దాని యడుగు లొత్తు.