Menu Close
GVRao
భావ లహరి
గుమ్మడిదల వేణుగోపాలరావు

దేశ ఐక్యతకు తోడ్పడే వారధులు

దేశ సంపద పెరగాలంటే ఉత్పాదకత ఉన్నత స్థాయికి చేరాలి; అప్పుడే దేశ పురోభివృద్ధి సాధ్యం అవుతుంది. దానికి 'ఈసురో మని మనుషుంటే దేశమేగతి బాగుపడునోయ్' అన్న గురజాడ వారి నానుడి రుజువుచేస్తూ ప్రజల దృష్టి, ఆలోచనలు తమ పొట్టలు నింపుకోవడానికే సరిపోతే సమాజ సేవకు, దేశ ఔన్నత్యానికి పాటు పడడానికి తావుండదు గనుక దేశ ప్రజల ఆకలి తీర్చడము ఎంతో అవసరం. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళికలో దేశం సస్యశ్యామలం చేయడానికే ఉన్న వనరులలో అధిక భాగం దానికే కేటాయించ బడింది. పంటలు సమృద్ధి గా పండించడమే కాక అధిక దిగుబడి నిచ్చే అధునాతన ఆరోగ్యకరమైన విత్తనాల ఉత్పత్తికై పరిశోధనా సంస్థలు ప్రోత్సహించ బడ్డాయి. ఆర్ధిక వనరులు కూడా వాటికై వినియోగించ బడ్డాయి. ప్రణాళికా బద్ధంగా జరిగిన ఆ ప్రయత్నం మంచి ఫలితాలనే యిచ్చిందని చెప్పాలి. ప్రజల కృషి, ప్రణాళికా రచయితల సామర్ధ్యానికి నిదర్శనంగా మనదేశంలో పండించిన తిండి గింజలు, పప్పుదినుసులు, పారిశ్రామిక ఉత్పత్తులు మన అవసరాలకు సరిపోగా మిగిలినవి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చెయ్యగలిగాము. వ్యవసాయ ఉత్పత్తులేకాక పారిశ్రామిక ఉత్పత్తులుకూడా తదుపరి పంచవర్ష ప్రణాళికలతో క్రమేణా పెరగడం దేశోన్నతికి తోడ్పడ్డాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తులు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు (ఆర్ధికంగా బ్యాంకు రుణాల ద్వారా కానీ, శాసన చట్టాలద్వారా గాని) అందించకపోతే పెరగడం సాధ్యమయ్యేదికాదు కాదు. ఆ ఉత్పత్తులన్నీ మన దేశంలోనే ఒకచోటనుంచి మరొక చోటికి గాని, మనదేశం నుంచి సహాయమందించమని కోరుతున్న మరొక దేశానికి గాని  పంపడానికి రహదారి పై గాని నది, సముద్రాలపై గాని చేర్చడానికి రవాణా వాహనాలు అవసరమయ్యాయి. దానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని వృద్ధిచెందుతున్న సాంకేతికతతో కొంగ్రొత్త  రీతిలో త్వరిత గతిని పయనించే వాహన సముదాయాన్ని సమకూర్చి శీఘ్రగతిని వాటిని గమ్యాన్ని చేరేందుకు కొంగ్రొత్త ప్రణాళికలు రచిస్తూనే ఉంది. దానికి దేశంలో అవి సులభంగా తిరగడానికి అనువైన రహదారులు ముఖ్యావసరం.

పూర్వకాలంనుంచి నదీ తీరాలని ఆనుకుని నదికి ఇరువైపులా జనాభా నివాసాలు ఏర్పరుచుకుని కాల క్రమాన గూడెములుగా ప్రారంభించిన నివాసాలు పల్లెలు గాను, క్రమంగా పట్టణాలుగాను పెరగడం వల్లను, మానవ బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు పెరగడం వల్ల రాకపోకలు పెరిగి నదులను దాటుటకు రవాణా సౌకర్యాలు అవసరమయ్యాయి. మొదట్లో పడవల పైనే తిరిగినా క్రమేణా మనుషులు, జంతువులు, తిరగడానికి రాత్రిళ్ళు కూడా సామాగ్రిని చేరవేయడానికి తిరిగే అవసరాలు పెరిగి వంతెనలు అవసరమయ్యాయి. మనదేశం లో ఉన్న అనేక కాల్వలు, చిన్న, పెద్ద నదులు దాటి సరకులు చేరవేయాలంటే వాటిపై వారధులు అవసరం. వందేళ్ళక్రిందట ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి వివిధ ఉత్పత్తులు చేరవేయడానికి పట్టేసమయంలో రవాణా సౌక్యర్యాలు, వారధులు పెరిగిన దృష్ట్యా ఇప్పుడు పడుతున్న సమయం దానిలో చాలా కొద్ది భాగం మాత్రమే పడుతోంది. మన దేశంలో ఉన్న పెద్ద నదులైన బ్రహ్మపుత్ర, గంగ, నర్మదా, గోదావరి, కృష్ణ, తుంగభద్రా, పెన్నా, కావేరి నదులను, సముద్ర భాగాలైన ముంబయి లోని వోర్లి  ప్రాంతము, రామేశ్వరం, ధనుష్కోడి ప్రాంతాలు దాటడం పెద్ద ప్రయత్నం గానే ఉండేది.  ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న అతి పెద్ద వారధులని లెక్కలోకి తీసుకుంటే కొన్ని ప్రత్యేకంగా నడక దారి వంతెనలు, చాల భాగం రహదారి (రోడ్) వంతెనలు, రైల్ వంతెనలు, కొన్ని రైలు- రహదారి కలిసిన వంతెనలు గాని అయి ఉన్నాయి. అవి కాల్వలపైన గాని, నదులపైనగాని, సముద్ర ప్రాంతాలనిగాని, రహదారి సముదాయాల్ని అధిగమించడానికి గాని, లోతైన లోయల్ని దాటుతూ కొండలపైన పయనించ డానికి గాని ఉపయోగపడుతాయి.  ప్రతి ఒక్క నిర్మాణం స్థానికముగా లభ్యమయ్యే ముడి సరుకుల్ని పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా సాంకేతికని పొందుపరుస్తూ, ఆర్ధిక పొదుపుని మరియు నిర్మాణ సౌలభ్యాలని పరిగణలోకి తీసుకుని నిర్మించబడ్డాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తాను.

నీటి ప్రదేశాలు దాటుటకు నిర్మించిన వారధులు :

Bridge-01

1. డా. భూపేన్ హజారీకా వంతెన: ప్రపంచల్లోని అతిపొడవైన వంతెన 164.8 కిలోమీటర్లు పొడవైన రైలువంతెన దాన్యంగ్- కుషాన్ వంతెన, బీజింగ్- షాంఘై లను హై స్పీడ్ రైల్రోడ్ తో కలుపుతూ చైనాలో ఉండగా, మన దేశంలోనే అతి పొడవైన 9.15 కిలోమీటర్లపొడవు, 12.9 మీటర్ల వెడల్పు గలిగిన  183 స్పాన్ లు గల వంతెన,- సంగీతకారుడు, గాయకుడు, అస్సామీస్ సినీ నిర్మాత డా. భూపేన్ హజారీకా పేరున అటల బిహారి వాజపేయి భావాలని సాకారం చేస్తూ రూపొందించబడిన వారధి. దీనిపై 60 టన్నుల బరువుగల సైనిక ట్యాంకులను తీసుకెళ్ల గలిగేటట్లు నిర్మించారు.  ఈ వంతెన బ్రహ్మపుత్రా నది పాయ ఐన లోహిత్ నదిపై తిన్సుకియా జిల్లాలో ధోలా- సాదియ ఊళ్లను కలుపుతూ ఉంది. 2017 లో ప్రారంభించబడిన ఈ వంతెన అస్సాం అరుణాచల ప్రదేశాలను కలుపుతూ భారత చైనా సరిహద్దులలో ఉండడం వల్ల సైనికావసరాలు తీర్చగలగడం దృష్ట్యాను, సామాన్య ప్రజల అవసరాలు తీర్చుతూను ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది.

Bridge-02

2. “డిబంగ్ నది వంతెన” : అస్సాంలోని డిబంగ్ (సీకాంగ్) నది పై నిర్మిచిన ఈ 6.2 కిలోమీటర్లు పొడవైన ఈ పుంజం వంతెన (బీమ్ బ్రిడ్జి) అన్ని కాలాల్లోనూ, అరుణాచల ప్రదేశ్ లో తూర్పునగల దాంబుక్ -రోయింగ్ లను కలుపుతూ, NH 13 లో భాగమై భారత దేశంలోనే పొడవైన వంతెనగా నిలిచింది. వ్యూహాత్మక ప్రాముఖ్యాన్నికలిగిన ఈ వంతెన తూర్పు వైపున చైనా సరిహద్దులకు అందుబాటులో ఉండి సైనిక రవాణా సహాయానికి ఎంతగానో ఉపయోగిస్తోంది. మరియు దేశ వ్యతిరేక శక్తులని ఎదుర్కొంటూ దేశ సంరక్షణకు ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతోంది. చాల నదీపాయల దాటుతూ నిర్మించిన ఈ వంతెన 2018 నుంచి సేవలనందిస్తోంది.

Bridge-033. మహాత్మా గాంధీ సేతు: నలభై మూడేండ్ల క్రిందట నిర్మితమై, పాటలీపుత్రం (పాట్నా, బీహార్) హాజీపూర్ లని కలుపుతూ గంగా నది పై 5 .75 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు 265 మీటర్ల ఎత్తులో గల ఈ గర్డర్ వంతెన 1982 న రాకపోకలకు ప్రారంభించబడింది. 46 స్పాన్ లు, 121 మీటర్లతో, 2 స్పాన్ లు 60 మీటర్ల తో గల ఈ వంతెనపై రోజుకి దాదాపు ఒక లక్ష మోటార్ వాహనాలు, 20,000 మంది జనం నడుచుకుంటూ గంగా నదిని దాటుతూ ఉంటారు. పర్యాటకులు కూడా గంగ పరిసర సుందర దృశ్యాలను చూచి ఆనందించడము, దీనిపై నడుస్తూ చిత్రాలు తీసుకోవడం మనం సామాన్యంగా చుస్తూఉంటాము.

Bridge-04
పదహారు ప్రాదేశికములతో (spans) 4.65 కిలోమీటర్ల పొడవైన వంతెన

4. విక్రమశిల సేతు: ధర్మపాల రాజ స్థాపన (783 -820 AD) చేసిన విక్రమశిల మహావీరుని స్మరణార్ధం గంగా నది పై బీహార్లో భాగల్పూర్ వద్ద 2001 లో నిర్మించిన 7 కిలోమీటర్ల పొడవు గల ఈ వంతెన రెండు జాతీయ రహదారులని (NH80 &NH31) భాగల్పూర్ -నౌగచియా లని కలుపుతూ రవాణాకు జీవనాడిగా నిలుస్తోంది. ఇది భాగల్పూర్ ని పూర్ణియా, కతిహార్ లకు సంధి మార్గమౌతోంది కూడా.

5. ఆర్రాహ్ - చాప్రా వంతెన : 'వీరకుమార్ సింగ్ సేతు' అనికూడా పిలవబడే బీహార్లోని శరన్ జిల్లాలో గంగానదిపై నిర్మించబడ్డ 55 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ద్విరహాదారి కలిగిన ఈవంతెన పాటలీపుత్రానికి వంద కిలోమీటర్ల దూరం తగ్గిస్తూ మరొకదారి రుజు మార్గాన్ని ఏర్పరుస్తుంది. 2021  లో ఉపయోగంలోకి తీసుకుని రాబడ్డ ఈ వంతెన ప్రపంచంలో తొమ్మిదవ అతి పొడవైన నీటి పై నిర్మింపబడ్డ వంతెనగా పేర్కొనబడింది.

Bridge-05
"ప్రెస్ట్రెస్డ్ గర్డర్ మరియు కేబుల్-స్టేడ్ వంతెనల కలయిక" అయిన ‘అర్రాహ్ - చాప్రా వంతెన’ – గంగా నది పై నిర్మింపడ్డ ప్రపంచంలోనే పొడవైన వంతెన
Bridge-06
పదహారు ప్రాదేశికములతో (spans) 4.65 కిలోమీటర్ల పొడవైన వంతెన

వచ్చే సంచికలో రైల్-రోడ్ మరియు ఇతర వంతెనల గురించి వివరిస్తాను.

-o0o-

Posted in August 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *