Menu Close
Ghali-Lalitha-Pravallika
కథ మొదలు మాది - ముగింపు మీది
ఘాలి లలిత ప్రవల్లిక

గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »

Prameela Sharma5. ప్రమీలాశర్మ: కథా శీర్షిక: వాడని పువ్వు

నా రచన

ఇంటిముందు స్కోడా కారు వచ్చి ఆగింది. తలకు రంగు, పెదవులకు లిప్స్టిక్ వేసుకుని, నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న శ్యామల హుందాగా నడిచి వస్తుంటే... డ్రైవరు డోరు తీసి పట్టుకున్నాడు. ఆమె కొత్త వేషం చూసి చుట్టుపక్కల ఆడవాళ్లు బుగ్గలు నొక్కుకున్నారు.

కారు వేగంగా షూటింగ్ స్పాట్ వైపుకి దూసుకుపోతోంది. శ్యామల మనసులో గతం తాలూకు ఆలోచనలు చెరిపేసింది. నటిగా కొత్త అవతారమెత్తిన ఆమె కాల్ షీట్ల కోసం డైరెక్టర్లు క్యూ కడుతుంటే వాత్సల్యం పంచే తల్లి క్యారెక్టర్ లో ఒదిగిపోవడానికి తనలోని సహజ నటిని వెలికి తీసింది శ్యామల.

******

Kolla Pushpa6. కొల్లా పుష్ప : కథకు నా ముగింపు

ఎవరేమనుకున్నా తను చేయాలని అనుకున్న పని చేయాలని నిశ్చయించుకుంది.

అన్నిటికన్నా ముఖ్యం తను ఆరోగ్యంగా ఉండడం. అది కావాలంటే ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు అనుకొని, ఒక యోగ సెంటర్లో జాయిన్ అయింది. రోజూ, తన వయసుకు తగ్గ వ్యాయామాలు, ధ్యానం చేసేది ఒక గురువు మాటల ద్వారా పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం తెచ్చుకుంది.

తనకున్న ఒక్క గొలుసు అమ్మేసి తనలాంటి వారికోసం ఒక హోమ్ మొదలుపెట్టింది. అక్కడ కేవలం తిండి పెట్టడమే కాకుండా ఆ వయసులో వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారేం చేయగలరో మార్గం చూపిస్తూ ఉండేది.

ఏదైనా అనుభవం వల్లే ఆమెకు తెలిసింది తన లాంటి వారెందరో నిరాశ నిస్పృహ లకు లోనై జీవితాన్ని అంతమొందించుకోవాలని సిద్ధపడుతున్నారని అందుకే వారిలో ఆత్మస్థైర్యం నింపి వాళ్ళకి దారి చూపించే విధంగా ఆ హోమ్ ను తయారు చేసింది.

ఆ హోమ్ పేరు "ఓల్డ్ మెటీరియల్ ఈజ్ నాట్ ఎ వేస్ట్ మెటీరియల్" అనే పేరు పెట్టింది.

తనని చూసి నవ్విన వాళ్లే తన దగ్గరకు వచ్చి ప్రయోజనాలు పొందుతుంటే 'ఇదే కదా నేను కోరుకున్నది' అనుకుంది గర్వంగా. తనకు ఈ మార్గం చూపించిన గురువుకు మనసులోనే అంజలి ఘటించింది.

******

Aruna Sandadiపేరు: అరుణ సందడి, శీర్షిక: తోడు నీడ

శ్యామలమ్మ లోకం మాటలను పట్టించుకోలేదు. తాను చేయాలనుకున్నది చేయాలని నిర్ణయించుకున్నది. అనుకున్న వెంటనే సామాన్లన్నీ సర్దుకుంది.

వెంటనే ఇల్లు వదిలి అడుగులు ముందుకేసింది.

******

రైల్వే స్టేషన్లో, విశ్వం ఎదురుచూస్తున్నాడు. దూరం నుండి వస్తున్న శ్యామలను పరీక్షగా చూస్తున్నాడు విశ్వం.

శ్యామల వచ్చింది. ఇద్దరు రైల్వే ప్లాట్ఫారం పై ఉన్న సిమెంట్ బెంచ్ పై కూర్చున్నారు.

"నా నిర్ణయం చెప్పినప్పుడు, పిల్లలు ఎవ్వరు కూడా పెద్దగా స్పందించలేదు. నీ ఇష్టం అన్నట్టు మాట్లాడారు.

అందుకే నిర్ణయించుకొని బయటికి వచ్చేసాను" అంది శ్యామల.

"బాధపడకు, ఇంక మీదట, నేను ఉంటాను కదా, దిగులు పడకు" అన్నాడు విశ్వం.

ఇద్దరు కలిసి రైలు ప్రయాణం చేశారు. విశ్వం కు, శ్యామలకు ఆ ఊరు కొత్త, అక్కడ ఉన్నవారు అందరూ కొత్తగానే ఉన్నారు.

ఇద్దరూ ఒక ప్రదేశం చేరుకున్నారు లోపలికి వెళ్లారు ఆఫీసులో ఎదురుగా కూర్చున్న వ్యక్తి వారిని చూసికూర్చోమని, "మీ పేరు ఊరు చెప్పండి" అన్నాడు.

"మీరు భార్యాభర్తనా" అని అడిగాడు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాదు, అన్నట్టు తల ఊపారు.

విశ్వం చెప్పడం మొదలెట్టాడు.

"మేము చిన్ననాటి స్నేహితులం కలిసి చదువుకున్నాము. మా జీవితంలో పెళ్లి, పిల్లలు బాధ్యతలన్నీ తీర్చేసాము.

మా ఆవిడ మరణించింది. నా స్నేహితురాలి భర్త మరణించాడు. ఇద్దరికీ ఇంట్లో ప్రేమ కరువైంది. పట్టించుకునే వాళ్ళు పలకరించే వాళ్ళు లేరు. అందుకే మేము నిర్ణయించుకున్నాం, ఇక్కడికి రావాలని" చెప్పాడు విశ్వం

"ఎవరికి బరువు కాదల్చుకోలేదు. నాకు నా స్నేహితురాలు, నా స్నేహితురాలికి నేను, మా ఇద్దరికీ  ఆదరణ లభించే చోటు ఇదే అని ఇక్కడకు వచ్చాం" అన్నాడు విశ్వం.

"మాకు శక్తి ఉన్నంతవరకు ఇక్కడ సహాయపడుతూ పనిచేస్తూ, ఇక్కడ ఉన్న అందరితో కలిసి మెలిసి ఉంటాము. సంతోషంగా ఉంటాము" అని సమాధానం ఇచ్చింది శ్యామల.

అంతేనా అన్నట్టు విశ్వం వైపు చూసింది శ్యామల. అవునన్నట్టు తల ఊపాడు చిరునవ్వుతో విశ్వం...

స్నేహానికి మించిన ఆదరణ ఎక్కడ ఉంటుంది ముసలిప్రాయంలో ఆప్యాయత, ప్రేమ అనుబంధాలు అన్నీ కలిపి ఒక్క స్నేహబంధంలోనే చూడగలుగుతాము.. కదూ అన్నట్టుగా ఉన్నాయి ఇద్దరి చూపులు...

పేర్లు నమోదు చేసుకొని అతను, ఇద్దరిని చూసి చిరునవ్వుతో మా "ఆదరణ వృద్ధాశ్రమం"లోనికి మీ ఇద్దరికీ స్వాగతం అంటూ లోపలికి దారి చూపించాడు.

******

****సశేషం****

Posted in May 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *