సంగీతం పై సాహిత్య ప్రభావం
క.) దేవులపల్లి కృష్ణ శాస్త్రి
1. (చిత్రం: సంపూర్ణ రామాయణం, సంగీతం: కే.వీ. మహదేవన్, పాడినవారు: పి.సుశీల) లింక్ »
పల్లవి:
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది
ఎందుకో ఎందుకో ప్రతి పులుగు యేదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది
చరణం 1:
అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి
ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి
నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో
అసలే ఆనదు చూపు ఆ పై ఈ కన్నీరు
తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఏలాగో.. నా రామా.. ఏదీ ఏదీ ఏదీ
నీల మేఘమోహనము నీ మంగళ రూపము
చరణం 2:
కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు
గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు.. పుట్ట తేనె రసాలు
దోరవేవో కాయలేవో అరముగ్గినవేవో గాని
ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా...
విందుగా అందీయనా
2. {చిత్రం: ఉండమ్మా బొట్టుపెడతా, సంగీతం: కే.వీ. మహదేవన్, పాడినవారు: పి.సుశీల} లింక్ »
అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
చరణం 1:
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి.. తెరలూ పొరలూ తొలగాలి
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
చరణం 2:
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
3. {చిత్రం: చిత్రం: బంగారు పంజరం, సంగీతం: ఎస్ రాజేశ్వర రావు , పాడినవారు; ఏ.పి.కోమల} లింక్ »
పదములె చాలు రామా!
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా!
చరణం : 1
నీ పద మంటిన పాదుకలు
మమ్మాదుకొని ఈ జగమేలు
నీ పదములె చాలు రామా!
నీ దయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా రామా..
నీ దయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా
నా బ్రతుకొక నావ
దానిని నడిపే తండ్రివి నీవా
పదములె చాలు రామా!
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా!
చరణం : 2
కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
నినుగానక నిమిషము మనలేను
నువు కనబడితే నిను కనలేను
పదములె చాలు రామా!
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా!
4. (చిత్రం: రాజమకుటం, సంగీతం: మాస్టర్ వేణు, పాడినవారు: పి. లీల) లింక్ »
ఊ..ఊ ఊ ఊ ఊఊ..ఊ ఊ ఊ ఊ
సడిసేయకో గాలి..సడి సేయబోకే
సడిసేయకో గాలి..సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకే...
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే
సడిసేయకే...
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే..
నిదుర చెదరిందంటే నేనూరుకోనే..
సడిసేయకే...
పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన బూని విసిరి పోరాదే..
సడిసేయకో గాలి..సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి..
5. (చిత్రం:మల్లేశ్వరి, సంగీతం: ఎస్.రాజేశ్వర రావు, పాడినవారు: పి. భానుమతి ) లింక్ »
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా..
అలలు కొలనులో గలగలమనినా..
దవ్వుల వేణువు సవ్వడి వినినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడిచిపోకుమా…
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా..
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
ఎంత హాయి యీ రేయి నిండెనో
6. (చిత్రం: మేఘసందేశం, సంగీతం: రమేష్ నాయుడు, పాడినవారు: పి. సుశీల) లింక్ »
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం 1 :
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరి చేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం 2 :
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా