వెన్నెల ప్రపంచంలోకి
నాకిప్పుడు
వెన్నెల ప్రపంచంలో
రంగుల హరివిల్లు లతో
ఆడుకోవాలని ఉంది.
అలసిన ప్రపంచం నుంచి
ఆశలు ఎగరేసి
వెన్నెల ఉయ్యాల లో
వూగాలనుంది.
కాసిన్ని కబుర్లు
కొంటె గాలులు
పచ్చని చేలు
తీయని ఊహలు
కలబోసీన విశ్రాంత ప్రపంచంలో
వికసించాలనుంది.
ప్రకృతి ఒడిలో
రాసుకున్న
వేలపరిమళాల
వాక్యాల్ని హద్దుకోవాలనుంది.
చెట్ల కొమ్మల మధ్య
చూపుల్ని ఆరేసుకోవాలనుంది.
ఒక కమనీయ లోకం లోకి
అవ్యక్త ప్రపంచం లోకి
తేలియాడే
నూతన ఉత్సాహం లోకి
సనాతనం గా
జీవించడం లోనే
జీవితం ముడిపడి ఉంది.
ముడి పడిన క్షణాల్ని
వెలసిపోకుండా
వెలిగించుకుంటూ
అవ్యక్త ఆనందం లోకి
జారుకుంటున్నాను.