Veg.ఆర్ట్!!
గుమ్మడి,పడతి మొగమాయె,బీట్సు నుదుట కళల బొట్టాయె/
అమ్మవలె మేల్జేయు వెల్లుల్లి తలను కుండాయె, చంటి కూనాయె/
కమ్మగ తిను కీర బీర బెండలు,ఔరౌర!అటునిటు సర్దుకొని పోయె/
ఆమె కళాసృష్టి,ఇంటి మల్లనకింకొక్క ట్రిప్పాయె నాత్మారాముకై!!
భక్త మహిమ!
మంగళ కైశికీ రాగమున పాడిన నిజ దాసు భక్తికా
అంగజ జనకు డౌదల దాల్చెనొ,ప్రాణఘాతి కడకు
అగడేమిలేక సత్యధీరుడై వెడలినదే మెచ్చెనో,తా
నర్గళముల ద్రెంచి పెన్రక్కసిని తోడ కైవల్య వీధుల
(ii)
గొంపోయే ఘనదాసరి భాగవత కులవతంసుడై,
పెంపుబడయరేహరిపాదార్చకబంధుబంధులున్!!
వాన చుక్క!!
ఆకసపు నీటి ముత్యపు బిందు సుందరములు
ఆకుల నంచుల అందగించి ఇంతలో జారునిల,
లోకము కింత ఓగిరమిడు సస్య ప్రాణాధారమై!
ఏ కనులు చూడని విభుని,దివిభువుల కానయై!!
సత్కవుల్!!
నేర్పరివై కావ్యమంకితమిడి నిండోలగముల
భూరి విరాళముల గొనుమన్న భోగి శ్రీనాథుడ
చ్చెరువొంద,పలుకులన్నియు రామభద్రునివె
అరయ కావ్యకర్తయు వాడె యనె కవియోగి,
(ii)
పోతనార్యుడు,హాలికవృత్తి మేలు కాదే,కునృప
దత్త సంపదలకన్న యంచు వాణి మోదంబందన్!