Menu Close
mg
- మధు బుడమగుంట -
Song

నెత్తురు మరిగితే ఎత్తర జెండా

పాట పాడటం ఒక ఎత్తు అయితే ఆ పాటను చిత్రీకరించిన విధానం ఆ పాటకు మరింత ప్రాచుర్యాన్ని అందిస్తుంది. చిత్రీకరణతో పాటు సందర్భానుసార సంగీత స్వరకల్పన తోడైతే, పాడినవారి గాత్ర శుద్ధి సరిగా అద్దితే ఇక ఆ పాట అందరి హృదయాలలో చిరకాలం నిలిచిపోతుంది. అలా ఉండడానికి ఆ పాట మాధుర్య ప్రధానమై ఉండాలని నియమం లేదు. వీనులకు ఇంపుగా వినేటప్పుడు శరీరంలో తెలియని భావపూరిత ఉద్వేగాలు కలిగి ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తే ఆ గేయం చిరకాలం గుర్తుంటుంది.

‘RRR’ సినిమా అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆస్కార పురస్కారం పొందిన ‘నాటు నాటు...’ పాట. అది నిజంగా ఒక అద్భుత సృష్టి. అయితే అదే సినిమాలో ఉన్న మరోపాట ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా....సత్తువ ఉరిమితే కొట్టర కొండా..’ నేను ఈ మధ్యనే వినడం జరిగింది. వినినంతనే ఏవో ప్రకంపనలు నా శరీరంలో కలగడం మొదలుపెట్టాయి. పాట చిత్రీకరించిన విధానాన్ని చూస్తూ పూర్తిగా వినిన తరువాత నిజంగా నాలో రక్తం మరిగినట్టే అనిపించింది. తెలుగు చిత్రసీమలో జక్కన్న గా సుపరిచితుడైన ఎస్.ఎస్. రాజమౌళి గారి దర్శకత్వంలో సృష్టించిన ఈ సృజనాత్మక భాండాగారం ఈ నేటి పాట. ఇది అందరిలో దేశభక్తిని ఇనుమడింపజేస్తుంది అనడంలో సందేహం లేదు. మీరు కూడా చదివి, విని, చూసి ఆనందించండి. నేర్చుకునే ప్రయత్నం చేయండి.

movie

ఆర్ ఆర్ ఆర్ (2022)

music

రామజోగయ్య శాస్త్రి

music

ఎం.ఎం.కీరవాణి

microphone

హారిక నారాయణ్, పృథ్విచంద్ర, సాహితి చాగంటి, విశాల్ మిశ్ర

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే
హ ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే
కసిగల కోడే కలకత్తా కోడే
గుజ్జు గల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు
చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా
చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
భల్లె భల్లె భల్లె భల్లె భల్లే
పంతమున్న కోడే పంజాబి కోడే
తగ్గనన్న కోడే టంగుటూరి కోడే
పౌరుషాల కోడే పల్లాస్సి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే హోయ్

వాడు వీడు ఎవరైతే ఏందిరా
నీది నాది మనదే ఈ జాతరా
దిక్కులనిండా దివిటీల దొంతర
దద్దరిల్లే దరువై శివమెత్తరా
వెయ్యర దండోరా వెళ్లి చెప్పర ఊరూరా
వేడుకలొచ్చెనురా వేల కనుల నిండారా
అది అది లెక్కా అదరాలి ఢంకా
ప్రాణమేసి ఆడు పైలా తైతక్క
తాళమేసి ఆడు తయ్యా తైతక్కా
చందనాలు తొక్కనీ చంద్రుడిలో జింకా
నేలమీద వాలగా ఆకాశంలో చుక్కా

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

Posted in November 2024, పాటలు