Menu Close
Kadambam Page Title
అరుదైన ఆస్తి
-- శ్రీ సాహితి --

చమురంటినా
ఇల్లు వెలుగుతూనే ఉంది.
మిణుకు మిణుకు మంటున్న వృద్దాప్యంతో

కిక్కిరిసిన ప్రేమంతా పట్నాలకు చేరినా
వాకిలి కళ తగ్గలేదు
గడప గుండె ఆగలేదు.

గోడలు పాతపడ్డా
ఇంటి కప్పు కారుతున్నా
ప్రేమ జల ఇంకిపోలేదు.

కాలం మారిందని మనిషి
మనసే మారిందని కాలం
మనిషికి మనసు పొంతనలేదని,

మనిషి స్థానంలో
డబ్బులొచ్చి సేవ చేస్తున్న
మార్పే లేనిదే ప్రేమతో

విలువలతో వెలిగే ఇల్లే
మనిషికి స్వర్గం..సర్వం..

అదే  అరుదైన ఆస్తి
కరిగిపోని ఆనందం
తిరుగులేని తృప్తి.....

Posted in November 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *