Menu Close
GVRao
భావ లహరి
గుమ్మడిదల వేణుగోపాలరావు

సంగీతం పై సాహిత్య ప్రభావం

ఔ. ) చేగొండి అనంత శ్రీరామ్:

1. (చిత్రం: ఊహలు గుసగుస లాడే, సంగీతం: కళ్యాణ్ కోడూరి, పాడినవారు: కళ్యాణ్ కోడూరి, సునీత ఉపద్రష్ట) లింక్ »

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలవని కాలిలాగ మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్లల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే

ఈ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గాని ఏమైనా అయిపొనీ ఏం పర్వాలేదన్నావా
అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుకా
అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా


2. {చిత్రం: చందమామ, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాడినవారు: ఆశాభోంస్లే, కే.ఎం.రాధాకృష్ణన్} లింక్ »

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులు గా అఅఅఅఅఅ పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతోందిలా
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవ్వాలనే
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులు గా అఅఅఅఅఅ పరుగులుగా
అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు


అం.) రామజోగయ్య శాస్త్రి

{చిత్రం: ఆర్ ఆర్ ఆర్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాడినవారు: హరిక నారాయణ్, పృథ్విచంద్ర, సాహితి చాగంటి, విశాల్ మిశ్ర } లింక్ »

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే
హ ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే
కసిగల కోడే కలకత్తా కోడే
గుజ్జు గల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు
చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా
చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
భల్లె భల్లె భల్లె భల్లె భల్లే
పంతమున్న కోడే. పంజాబి కోడే
తగ్గనన్న కోడే టంగుటూరి కోడే
పౌరుషాల కోడే పల్లాస్సి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే హోయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు


అః) సాహితి

4. (చిత్రం: వేదం; సంగీతం: ఎం.ఎం.కీరవాణి., పాడినవారు: సునీత) లింక్ »

గుండె గుబులుని గంగకు వదిలి
ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతల కొదిలి
సిగ్గు ఎగ్గూలు చీకటి కొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి
తొలి తొలి విరహపు చెరలను వదిలి
గడులని వదిలి ముడులను వదిలి
గడబిడ లన్ని గాలికి వదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

లోకం రంగుల సంతా
ప్రతిదీ ఇక్కడ వింత
అందాలకు వేళా ఎంత
కొందరికే తెలిసేటంత
పాతివ్రత్యం
పై పై వేషం
ప్రేమా త్యాగం
పక్కా మోసం
మానవ శీలం
వేసేయ్ బేరం
మన బతుకంతా మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి
తదుపరి కలబడి త్వరపడి ఎక్కడికో
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

నా సొగసులకు దాసుడవౌతావో నీతో
నా అడుగులకు మడుగులొత్తగలవా నీతో
నను కోట్లకు పడగా లెత్హిస్తానంటావా నీతో
నా గుడి కట్టి హారతులిస్తావా నీతో
నీతో నీతో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరిపోతే బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

### సశేషం ###

Posted in November 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!