Menu Close
Lalitha-Sahasranamam-PR page title

అష్టాదశోధ్యాయం

(అమ్మవారి సమగ్ర రూపం వర్ణన, ఫలశృతి)

శ్లోకాలు: 167/2-183, సహస్రనామాలు: 901-1000

909. ఓం సామగాన ప్రియాయై నమః
సామగానము నందు విశేష ప్రీతిగల మాతకు నమస్కారాలు.


910. ఓం సౌమ్యాయై నమః
సౌమ్య--శాంత స్వరూపిణికి వందనాలు.


911. ఓం సదాశివ కుటుంబిన్యై నమః
సదాశివుని పత్నికి వందనాలు.


912. ఓం సవ్యాపసవ్య మార్గస్థాయై నమః
సవ్యమార్గంలోను, అపసవ్య మార్గంలోనూ కూడ భాసిల్లు మాతకు వందనాలు.


913. ఓం సర్వాపద్వినివారిణ్యై నమః
సమస్తమైన ఆపదలను నివారించినట్టి మాతకు వందనాలు.


914. ఓం స్వస్థాయై నమః
స్వస్థానంలో భాసిల్లు మాతకు వందనాలు.


915. ఓం స్వభావమధురాయై నమః
సహజంగా మధురమూర్తియైన మాతకు వందనాలు.


916. ఓం ధీరాయై నమః
ధైర్య స్వరూపిణికి ప్రణామాలు.


917. ఓం ధీరసమర్చితాయై నమః
ధీరులచే చక్కగా పూజింపబడునట్టి మాతకు నమస్కారాలు.


918. ఓం చైతన్యార్ఘ్య సమారాధ్యాయై నమః
ఆత్మజ్ఞానం ద్వారా ఆరాధించబడునట్టి మాతకు వందనాలు


919. ఓం చైతన్యకుసుమప్రియాయై నమః
మహత్తర ఫలాలను ప్రసాదించునట్టి చైతన్య కుసుమము నందు ప్రీతిగల మాతకు నమస్కారాలు.


919. ఓం సదోదితాయై నమః
సదా సర్వదా ప్రకాశించునట్టి మాతకు ప్రణామాలు.


921. ఓం సదాతుష్టాయై నమః
సదా సర్వదా తుష్టి కలిగి ఉండునట్టి మాతకు వందనాలు.


922. ఓం తరుణాదిత్య పాటలాయై నమః
మధ్యాహ్న మార్తాండుని వంటి అరుణకాంతులతో భాసిల్లు మాతకు నమస్కారాలు.


923. ఓం దక్షిణాదక్షిణారాధ్యాయై నమః
దక్షిణమార్గంలోను, ఆ దక్షిణ మార్గం ద్వారానూ కూడా ఆరాధింపబడునట్టి మాతకు ప్రణామాలు.


924. ఓం దరస్మేర ముఖాంబుజాయై నమః
మందస్మిత వదనారవిందంగల మాతకు ప్రణామాలు.


925. ఓం కౌళినీకేవలాయై నమః
ఏకైక కౌళినీ స్వరూపిణి అయిన మాతకు వందనాలు.


926. ఓం అనర్ఘ్య కైవల్య ప్రదదాయిన్యై నమః
అనర్ఘమైన కైవల్య పదాన్ని ప్రసాదించు మాతకు వందనాలు.


927. ఓం స్తోత్రప్రియాయై నమః
పరమ పవిత్రమైన భగవత్ గుణగణ వర్ణనాత్మకమైన స్తోత్రాలందు ప్రీతి కల మాతకు నమస్కారాలు.


928. ఓం స్తుతిమత్యై నమః
స్తుతిమతి స్వరూపిణికి వందనాలు.


929. ఓం శ్రుతిసంస్తుత వైభవాయై నమః
వేదాలచే సంస్తుతింపబడిన మహత్తర వైభవం కల మాతకు వందనాలు.


930. ఓం మనస్విన్యై నమః
స్వాధీనంలో ఉన్న మనస్సుగల మాతకు వందనాలు.


931. ఓం మానవత్యై నమః
మానవత్వం--కరుణ, దాతృత్వాది మహోత్తమ సద్గుణాలుకల తల్లికి వందనాలు.


932. ఓం మహేశ్యై నమః
మహేశుని అర్థాంగి అయిన మహేశికి నమస్కారాలు.


933. ఓం మంగళాకృత్యై నమః
మంగళకరమైన ఆకారం కల మాతకు వందనాలు.


934. ఓం విశ్వమాతాయ నమః
అఖిల విశ్వాలకూ జనని అయిన లలితా దేవికి వందనాలు.


935. ఓం జగద్ధాత్త్యై నమః
ధాత్రీరూపంలో సర్వ ప్రాణులను పోషించు తల్లికి నమస్కారాలు.


936. ఓం విశాలాక్ష్యై నమః
విశాలమైన సుందర నయనాలు కల మాతకు నమస్కారాలు.


937. ఓం విరాగిణ్యై నమః
వైరాగ్యభావం కల తల్లికి ప్రణామాలు.

***** సశేషం *****

Posted in October 2024, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!