Menu Close
Page Title

సంగీతం పై సాహిత్య ప్రభావం

ఒ.) దాశరధి కృష్ణమాచార్య:

1. (చిత్రం: రంగులరాట్నం, సంగీతం: ఎస్. రాజేశ్వర రావు, పాడినవారు: ఘంటసాల, ఎస్.జానకి) లింక్ »

నడిరేయి ఏ జాములో
స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో ॥నడిరేయి॥
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా... ఆ... ఆ... ఆ....
మముగన్న మాయమ్మ అలివేలు మంగా... ఆ... ఆ...
మముగన్న మాయమ్మ అలివేలు మంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

కలవారినే గాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేని నాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లీ అనురాగవల్లీ
అడగవే మాయమ్మ అలివేలు మంగా  ॥నడిరేయి॥


2. {చిత్రం: బుల్లెమ్మా బుల్లోడు, సంగీతం: సత్యం, పాడినవారు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల} లింక్ »

అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట..
అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట..
దేవుడే లేడనే మనిషున్నాడు.. అమ్మే లేదనువాడు అసలే లేడు..
దేవుడే లేడనే మనిషున్నాడు.. అమ్మే లేదనువాడు అసలే లేడు..
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ..
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకూ..

అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట!!
అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా..
అమ్మ మనసు అమృతమే చూడురా.. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా..ఉందిరా..
అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట మమతల మూట!

అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే.. అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే..
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే..
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది? అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది?
అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ నాదీ!!

అమ్మ అన్నది ఒక కమ్మని మాట.
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట!!


3. {చిత్రం: ఆత్మీయులు, సంగీతం: పెండ్యాల, పాడినవారు: పి.సుశీల} లింక్ »

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైనా కనని ఆనందం యిలలోన విరిసె ఈనాడె ||మదిలో||
సిగ్గుచాటున నా లేతవలపు మొగ్గతొడిగింది ||సిగ్గు||
పాలవెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది ||మదిలో||
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను
అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను ||మదిలో||
రాధలోని అనురాగమంతా మాధవునిదేలే ||రాధ||
వేణులోలుని రాగాల కోసం వేచియున్నదిలే ||మదిలో||


4. (చిత్రం: మూగమనసులు, సంగీతం: కే.వీ.మహదేవన్, పాడినవారు: పి.సుశీల) లింక్ »

గోదారి గట్టుంది _ గట్టు మీద శెట్టుంది
శెట్టు కొమ్మన పిట్టుంది
పిట్ట మనసులో ఏముంది ? ఓ....      ||గోదారి||

ఒగరు ఒగరుగా పొగరుంది
పొగరుకి తగ్గ బిగువుంది                ||ఒగరు||
తియ్యతియ్యగా సొగసుంది
సొగసును మించే మంచుంది      ||తియ్య|| ||గోదారి||

యెన్నెల వుంది _ యెండ వుంది
పువ్వూ వుంది _ముల్లుంది
యెన్నెల వుంది _ యెండ వుంది
పువ్వూ వుంది _ముల్లుంది
యేది ఎవ్వరికి యివ్వాలో యిడమరిసే ఆ ఆది వుంది ||గోదారి||

పిట్ట మనసు పిసరంతైనా పెపంచామంతా దాగుంది    ||పిట్ట||
అంతుదొరకని నిండుగుండెలో _ఎంత తోడితే అంతుంది ||అంతు|| ||గోదారి||

### సశేషం ###

Posted in September 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!