Menu Close
Page Title

సంగీతం పై సాహిత్య ప్రభావం

ఐ.) సి. నారాయణ రెడ్డి:

7. (చిత్రం: పూజాఫలం, సంగీతం: ఎస్. రాజేశ్వర రావు, పాడినవారు: ఘంటసాల) లింక్ »

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో, తీగసాగెనెందుకో
నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో

పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో

చెలినురుగులే నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో

పసిడి అంచు పైట జారా..ఆ.ఓ..ఓ
పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో


8. {చిత్రం: పూజాఫలం, సంగీతం: ఎస్. రాజేశ్వర రావు,  పాడినవారు: సుశీల} లింక్ »

పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే..

నింగిలోన చందమామ తొంగిచూచే
నీటిలోన కలువభామ పొంగి పూచే..
ఈ అనురాగమే జీవనరాగమై
ఎదలో తేనేజల్లు కురిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల..

కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే
మురళి పాట విన్న నాగు శిరసునూపె
ఈ అనుబందమే మధురానందమై
ఈ అనుబందమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా
పగలే వెన్నెల జగమే ఊయల..

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగచూచి పికము పాడే
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగచూచి పికము పాడే
మనసే వీణగా ఝనఝన మ్రొయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే.. పగలే వెన్నెల


9. {చిత్రం: భక్త తుకారాం, సంగీతం: పి.ఆదినారాయణరావు, పాడినవారు: సుశీల} లింక్ »

పూజకు వేళాయెరా! రంగ పూజకు వేళాయెరా
పూజకు వేళాయెరా! రంగ పూజకు వేళాయెరా

ఇన్నినాళ్ళు నేనెటుల వేచితినొ
ఎన్నిరేలు ఎంతెంత వేగితినొ
పిలువును విని, విచ్చేసితివని, నా
పిలువును విని, విచ్చేసితివని,

వలపులన్ని నీ కొరకె దాచితిని
ఎవరూ పొందని ఏకాంతసేవలో
ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు  "పూజ"


10. (చిత్రం: తల్లా-పెళ్ళామా, సంగీతం: టీ.వీ. రాజు, పాడినవారు: ఘంటసాల) లింక్ »

పల్లవి:
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా …
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

చరణం 1:
మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

చరణం 2:
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

చరణం 3:
ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగలగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగలగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది


11. (చిత్రం: స్వాతి కిరణం, సంగీతం: కే.వీ. మహదేవన్,  పాడినవారు: ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్) లింక్ »

ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి "ప్రణతి"

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపాలకు జోలలు పాడే...... గాలుల సవ్వడి హ్రీంకారమా, హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల
అలజడి శ్రీంకారమా, శ్రీంకారమా
ఆ బీజాక్షర వితతికి
అర్పించే జ్యోతలివే "ప్రణతి"

చరణం:
పంచ భూతముల పరిష్వంమున
ప్రకృతి పొందిన పదస్పందన
అది కవనమా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలన
అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల
తళుకందిన సువర్ణ లేఖన
అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగా
మలచిన సజీవ కల్పనా అది శిల్పమా

అది శిల్పమా, అది శిల్పమా, అది శిల్పమా
ఆ లలితా కళా సృష్టికి అర్పించే జ్యోతలివే  "ప్రణతి”


12. (చిత్రం: జయసుధ, సంగీతం: రమేష్ నాయుడు, పడినవారు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) లింక్ »

ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తివో
ప్రణయ భావనకు ప్రధమ మూర్తివో
ప్రణయ గగనమున ప్రధమ రేఖవో
రేఖవో.. శశిరేఖవో.. సుధవో.. జయసుధవో..ఓ..
ఆ.. ఆ.. ఆ..

తరళ తరళ నీ హార యవనికల మెరిసే.. సూర్య కళికా
మృదుల మృదుల నవ పవన వీచికల కదిలే.. మదన లతికా
తరళ తరళ నీ హార యవనికల మెరిసే.. సూర్య కళికా
మృదుల మృదుల నవ పవన వీచికల కదిలే.. మదన లతికా
నీ లలిత చరణ పల్లవ చుంబనమును పులకించును వసుధా.. జయసుధా..

ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తివో
ప్రణయ భావనకు ప్రధమ మూర్తివో
ప్రణయ గగనమున ప్రధమ రేఖవో
రేఖవో.. శశిరేఖవో.. సుధవో.. జయసుధవో..ఓ..

శరదిందీవర చలదిం దిందిర స్పురందీల కుంతలవో
ఋశ్యాశ్యమ ఘట దుశ్యంత చకిత దృశంకిత శకుంతలవో..
అది నితలమా.. సురుచిర శశాంక శకలమా..
అవి కనుబొమలా.. రతీమన్మధుల ధనువులా..
అది అధరమా.. ఆ..ఆ..
అమృత సదనమా.. ఆ.. ఆ..
అది గాత్రమా.. ఆ..ఆ..
జీవ చిత్రమా.. ఆ.. ఆ.. ఆ..

అది అధరమా.. అమృత సదనమా
అది గాత్రమా.. జీవ చిత్రమా.. ఆ.. ఆ.. ఆ..

నీ నయన లేఖినులు విరిచించెను అభినవ రసమయగాధా..
జయసుధా.. ఆ..

### సశేషం ###

Posted in August 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!