Menu Close
Kadambam Page Title
ఆ రోజు మళ్ళీ
చందలూరి నారాయణరావు

ఆ వైపున నీవు
ఈ దిక్కున నేను

ఒకే రుచి గల ఇరువురి మాటలు ఎన్నో
ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ

నా నిద్రలో నిలబడి
నీ కలను నాటి

నిన్ను గడుపుకుపోతుంటే
అలుపొస్తుంది కళ్లకు

నీతో కలుపుపోతుంటే
ఆయాసమొస్తుంది ఆలోచనకు

ఇంకెంత దూరంలో ఉందో?
నీకై తపిస్తూ తప్పిపోయిన నా సంతోషం

ఇంకెప్పుడు వస్తుందో?
నిన్ను పరిచయం చేసిన ఆ రోజు మళ్ళీ

Posted in July 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *