Menu Close
Kadambam Page Title
Obulesu Goud
ఎన్నికల వేళ
‘ఉదయశ్రీ ’ యు.సి.ఓబులేశు గౌడు

ఇది ఎన్నికల వేళ
రాజకీయేంద్రజాలికుల
ఊహల అల్లికల హేళ
అమాయక కీటకాలను
పద్మవ్యూహపు గూడులోకి
స్వాగతించి స్వాహాచేసే
సాలీడు పరాన్నజీవుల్లా
మ్యానిఫెస్టుల పెస్టులతో
అంతులేని పథకాల లిస్టులతో
అమలు సాధ్యం కాని కిస్తులతో
వరదానపు వాగ్బాణపు కిట్టులతో
ఓటు కోసం సాగిలపడుతున్నారు
ఓటరు ముందు చిందులేస్తున్నారు
ఏవోవో హావభావాలు వేషభాసలు
ప్రత్యర్థులపై దూషణ భాషణ ఘోషలు
ఓటరు మహాశయా!యిది వినవయా!
ఎవరెన్ని బూటకాల నాటకాలాడినా
వారు వీరు వెలగబెట్టిన గతవైభవాన్ని
నీతి నియమాలు తగలబెట్టిన అనుభవాన్ని
మదిలో మరువబోకు నీ విధిలో వెరవబోకు
ఐదేళ్ళకోమారు నీకు అందివచ్చే
ఓటు ప్రాభవాన్ని చేజార్చుకోకు
విజ్ఞతతో సవ్యంగా వ్యవహరించు
ప్రజ్ఞాపాటవం దివ్యంగా ప్రదర్శించు
అసలు సిసలైన ప్రజా ప్రతినిధులనెంచు
ఓటు వేసి పాలనాపట్టం అందించు

Posted in May 2024, కవితలు

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *