2019 కి స్వాగతం! |
|
తే.గీ. | నూతనోత్సాహ మొసగి వినూత్నప్రగతి ఆయురారోగ్యసంపద లందరి కిడి మందహాసాలు ముఖసీమ లందు చింద రమ్ము నవవత్సరమ! స్వాగతమ్ము నీకు |
తే.గీ. | ఆంగ్లమైనను తెనుగైన నాది యాది క్రొత్తదన మన్నదే చిగుర్చును మనోర థాల తరుశాఖ లన్నింటి కాలమిదియె కన్న కలలన్ని పండ కాన్కల నొసంగు |
ఉ. | నేస్తమ! నీదురాకకయి నిన్నెతలంచుచు చూతు మయ్య నీ హస్తములందు దాచుకొని యందగ జేయగ నేమి తెత్తువో? వస్తువు లేవి యైనను శుభప్రదలక్షణభాసురమ్ములై ప్రస్తుతవాస్తవమ్ములకు ప్రస్తరణంబగు శోభ గూర్పగన్ |