Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు

వర గానామృత ధార

ఓ గానామృత ధార పుట్టిన రోజు
ఆ వర గాత్ర ధీర మెట్టిన రోజు

ఆ ఆరు తలల శివ సుత సుబ్రహ్మణ్యుడు
ఈ ఆరు ఋతువుల బాల సుబ్రహ్మణ్యుడు

ఏ ఋతువైన.... ఏ రాగమైన
సరస సంగీత సాహిత్య సమరాంగుడు
మానస రంజిత మాణిక్య వీణా నాథుడు
పండితా రాధ్యుల
సంగీతా రాద్యుల
మన చిరు సుర రాగాల
మది మురిపాల గీతాల
మన బాల సుబ్రమణ్యం
వినిన రాగాల సంబరం

తెలుగు సినీ వినీలాకా శా న దిశ వేగు చుక్క
వెలుగు ది వ్వెల నవ రాగాల తురుపు ముక్క

రాగాలను వయ్యారంగా
భావాలను సింగారంగా
గమకాలను అనురాగంగా
తమకాలను జీవనంగా

గొంతు దారుల రంగరించిన సవ్యసాచి
గుండె లోతుల సంగ్రహించిన దిక్చూచి
అన్ని భాషల ...
వన్నె యాసల...
పలకరించి... పులకరించగ
పలవరించి.. పరవశించగ
మనల గుండె గుండెకు పాటల ఊపిరి పోసి
ఈ బాల గాన గంధర్వుడు పాటకే ఊ పిరి పోసి

అమర పురికేగినాడు
అద్భుతమైన పాటగాడు

భారత భూమిని స్వరాల నేలి
చరిత జీవిగా సస్వరాల తేలి
దేవసభలో గాన గంధర్వునిగా
తన గానామృతాన్ని పంచడానికి

వెల్లినాడేమో కదా!
తల్ల డిల్లు తున్నాము సదా!

పాడుతా తీయగా అంటూ పులకింప జేసిన
నవ్వుతూ హాయిగా గీతాల అలరింప జేసిన
వెలుగుల బాలు పుట్టిన రోజు
తెలుగింట పాట మెట్టిన రోజు

ఆయనకివే సిరి మల్లెల శ్రద్దాంజలి
భారతీయుల మది విరిసిన గీతాంజలి.

Posted in June 2021, తేనెలొలుకు, బాలు ప్రత్యేకం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!