Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౧౨౮౧.ఎల్లీ! ఎల్లీ,నువ్వు పోటువెయ్యి, నేను డొక్కలెగరేస్థా - అన్నట్లు ...
౧౨౮౨.అంగత్లో అన్నీ ఉన్నాయ్, అల్లుది నోత్లో షనీ ఉంది.
౧౨౮౩ .యాదవ కుల నాశనానికి ముసలం పుట్టింది !
౧౨౮౪ .అన్నీ ఉన్నాయి కానీ, ఐదతనమే తక్కువయ్యింది ...
౧౨౮౫ .పాడి ఎక్కువ, భాగ్యo  ఎక్కువ ఉంటుందా ఎక్కడైనా?
౧౨౮౬ .పసిబిద్దకు, పాలకుందకు మరుగు ఉండాలి...
౧౨౮౭ .పోత్ల గిత్తకు రోలు అడ్డం ఔతుందా...
౧౨౮౮ .స్వాతి చినుకులు పడితే, ముత్యపు చిప్పలు పుడతాయి...
౧౨౮౯ .మన బంగారం మంచిదైతే, కంసాలి ఏమీ చెయ్యగలడు?..
౧౨౯౦ .నిండా మునిగాక, ఇంకా చలి ఏమిటి  ?
౧౨౯౧ .చక్కతనానికి నేను (ఒంటె) , సంగీతానికి నా చెల్లి (గాడిద) పెట్టింది పేరు!...
౧౨౯౨ .చదువు రాని మొద్ధు, కదల లేని ఎద్దు ...
౧౨౯౩ .చదవేస్తే  ఉన్న మతి కాస్తా కూడా పోయిందిట!
౧౨౯౪ .వెర్రి వేయి విధాలు...
౧౨౯౫ .వెర్రి కుదిరింది, ఇక తలకి రోకలి చుట్టుకోవచ్చు - అన్నాట్ట ...
౧౨౯౬ . వెర్రికి తొర్రి తోడైయిందిట !
౧౨౯౭ .రాచ పీనుగు తోడు లేందే వెళ్ళదు.
౧౨౯౮ .నన్ను చూడు, నా అందం చూడు, పక్కనున్న సావాసం చూడు...
౧౨౯౯ .అదృష్టం కరుణిస్తే, పట్టిందెల్లా బంగారం, ముట్టిందెల్లా ముత్యాలూ అవుతాయి...
౧౩౦౦ .చీర ఎరువిచ్చి, పీట పట్టుకుని వెంట తిరిగింది ...

***సమాప్తం***

Posted in August 2021, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!