Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౧౨౨౧. తనదైతే తాటి టెంక, ఇతరులదైతే ఈత గింజ...
౧౨౨౨. తన బలిమి కన్నా స్థానబలిమి మిన్న.
౧౨౨౩. తప్పులెంచే వారికి తమ తప్పు తెలియదు.
౧౨౨౪. తప్పు లేని మనిషి లేడు, చెప్పలేని మాట లేదు.
౧౨౨౫. తాంబూలం వెయ్యని నోరు తామరలు లేని కొలను లాంటిది.
౧౨౨౬. తాబేలులా, కష్టం వస్తే తాత్కాలికంగా తలదాచుకోవాలి ...
౧౨౨౭. తల గొరిగించుకున్నాక తిధి వార నక్షత్రాలు చూసినట్లు...
౧౨౨౮. తలనువున్న ప్రాణం తోకలోకి వచ్చినట్లు ....
౧౨౨౯. తలలు  బోడి అయినంతమాత్రాన తలపులు బోడి కావు.
౧౨౩౦. తలలో నాలుకలా, పూసల్లో దారంలా కలసిమెలసి ఉండాలి.
౧౨౩౧. తల్లికి కూడుపెట్టని నిర్భాగ్యుడు తగవరిగా పనికిరాడు.
౧౨౩౨. తలచున్న నాడే తలంబ్రాలు కావాలంటే ఎలా ...
౧౨౩౩. తల్లిని చూసి పిల్లని, పళ్ళను చూసి పశువును అంచనా వెయ్యవచ్చు.
౧౨౩౪. తల్లిని నమ్మినా, ధరణిని నమ్మినా సాధారణంగా చెడు జరగదు.
౧౨౩౫. తల్లి పుట్టినిల్లు గురించి మేనమామలకు తెలియదా ...
౧౨౩౬. తల్లి లేని పుట్టిల్లు ఉల్లిలేని కూర లాంటిది.
౧౨౩౭. తవ్వగా తవ్వగా జల పడుతుంది.
౧౨౩౮. తరచి చూస్తేగాని నిజం బయటపడదు.
౧౨౩౯. తాగిన వాడిదే ఆట, సాగినవాడిదే బాట...
౧౨౪౦. తాడిచెట్టు నీడ నీడా కాదు, తగులుకున్న ఆడది ఆలీ కాదు.

Posted in May 2021, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!