Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౪౭౧. పిట్ట కొంచెం, కూత ఘనం.

౪౭౨. ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీల మోత.

౪౭౩. చీకటికి నక్షత్రాలు ఎక్కువ, దరిద్రుడికి పిల్లలెక్కువ.

౪౭౪. ఆశ అందలం ఎక్కమంటే, రాత గాడిదల్ని కాయించిందిట!

౪౭౫. ఉడుము కెంధుకురా బాబూ, ఊరి పెత్తనం....

౪౭౬. ఉరుము ఉరిమి, (పిడుగు) వచ్చి మంగలం మీద పడిందిట!

౪౭౭. ఎల్లీ, ఎల్లీ నువ్వు పోటు వెయ్యి, నేను డొక్కలెగరేస్తాను అన్నట్లు....

౪౭౮. ఆస్తి మూరెడు, ఆశ బారెడు...

౪౭౯. తాలువడ్లకు నీళ్ళకల్లుకు చెల్లు.

౪౮౦. కంటికి తగిలే పుల్లని కనిపెట్టి ఉండాలి.

౪౮౧. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం!

౪౮౨. రాయి తరవాత రాయి తీస్తూపోతే ఎంతటి కొండైనా తరిగిపోతుంది.

౪౮౩. ఒక చేత బెల్లం, మరో చేత అల్లం ...

౪౮౪. ఒక ఊరి రాజు మరో ఊరి మాల!

౪౮౫. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవచ్చునేమోగాని, ఒకే ఇంట్లో రెండు కొప్పులు ఇమడవు.

౪౮౬. ఏరు దాటి తెప్ప తగలేసినట్లు ...

౪౮౭. ఎద్దు చేలోపడి మేస్తే, గాడిద చెవులు తెగ్గోశారుట!

౪౮౮. ఇంటి గుట్టు ఈశ్వరునికే ఎరుక!

౪౮౯. లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

౪౯౦. ఈవలి గట్టునుండి చూస్తే ఆవలిగట్టు పచ్చగా కనిపిస్తుంది.

౪౯౧. "యధారాజా, తదా ప్రజాః"

౪౯౨. కొంగ జపం చేప దొరికేవరకే...

౪౯౩. దప్పిక పుట్టిన తరువాత నీళ్ళకోసం బావి తవ్వడం మొదలెట్టినట్లు ...

౪౯౪. నరం లేని నాలుక నానా మాటలూ అనగలదు.

౪౯౫. దగ్గితేనే ఊడే ముక్కు తుమ్మితే ఉంటుందా...

౪౯౬. నూరు మాటలైనా ఒక్క రాతకు సరిగావు.

౪౯౭. ఇంటి పెద్దను నేనే, పెట్టరా పిల్లికి పంగనామాలు - అన్నట్లు ...

౪౯౮. నెత్తి కాలనిదే జోలి నిండదు.

౪౯౯. నాధుడు లేని రాజ్యం నానాదారులా పోతుంది.

౫౦౦. నువ్వు రాసిన పద్యానికి యతీ లేదు, దున్నపోతుకు మతీ లేదు.

Posted in May 2019, సామెతలు

1 Comment

  1. v v b rama rao

    you must be working very very hard
    god bless you i admire your tenacity
    in half an hour i quickly surfed on the very interesting columns
    all are interesting – basically informative too
    i wish i had a way to honour you fittingly

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!