Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

 

౨౯౧. పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా చెడగొరిగిందిట!

౨౯౨. పండిన కాయ గాని నేల రాలదు.

౨౯౩. పాపం పండాక గాని ప్రళయం రాదు.

౨౯౪. నిప్పు లేనిదే పొగరాదు.

౨౯౫. పొగమంచు పొగ కాదు.

౨౯౬. మిణుగురులను పోగుచేసి చలి కాచుకోలేము.

౨౯౭. వేడి నీళ్ళకు ఇళ్ళు కాలవు.

౨౯౮. పులిని బ్రాహ్మణుడు పెంచినా అది వేటాడక మానదు.

౨౯౯. చెవిటివాని చెవిలో సంగీతం పాడినట్లు...

౩౦౦. గోదావరికి వరద వచ్చినా, కోపదారికి ఆవేశం వచ్చినా హద్దులు నిలవవు!

౩౦౧. నోరు మంచిదైతే ఊరూ మంచిదే ఔతుంది.

౩౦౨. నోరు మాటాడితే నొసలు వెక్కిరిస్తాయి...

౩౦౩. కంచం పొత్తేగాని, మంచం పొత్తు లేదు.

౩౦౪. పేరులో ఏముంది పెన్నిధి?

౩౦౫. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు...

౩౦౬. లోకులు పలుగాకులు ...

౩౦౭. విశ్వాసం లేని కుక్క వెతికినా దొరకదు.
౩౦౮. బురదలో రాయి వేస్తె ఒళ్లంతా బురదపడక మానదు..

౩౦౯. ఇల్లు అలకగానే పండుగ కాదు....

౩౧౦. వేలున్నంతమాత్రంలో గారెలు వండలేవు.

౩౧౧. అలికిన ఇంట్లో (ముగ్గు) ఒలికినా అందమే...

౩౧౨. తీగ లాగితే డొంకంతా కదులుతుంది.

౩౧౩. శంఖంలో పోస్తేగాని నీటిని తీర్థం అనరు.

౩౧౪. బోడి గుండుకు బొడ్డుమల్లెల సింగారమా!

౩౧౫. మతిలేని మనిషికి శృతిలేని పాట!

౩౧౬. బోడి గుండుకూ, బొటనవేలుకు ముడా!

౩౧౭. గతిలేనమ్మకు మతిలేని మొగుడు.

౩౧౮. గతి లేనప్పుడు గంజే పానకం.

౩౧౯. కీడెంచి మేలెంచాలి.

౩౨౦. రౌతునుబట్టి ఉంటుంది గుర్రపు నడక.

Posted in October 2018, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!