Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౧౨౦౧. జెముడు మొక్క  కంచకు శ్రేష్టం, రేగడినేల చేనుకి శ్రేష్టం.
౧౨౦౨. జోడీ లేని బ్రతుకు, తాడులేని బొంగరం ఒకటే...
౧౨౦౩. డబ్బు లేనివాడు ముందే దోనెక్కి కూచున్నాడుట!
౧౨౦౪. డబ్బులేనివాడు డుబ్బుకి కొరగాడు...
౧౨౦౫."డాబుసరి బావా" అని పలకరిస్తే, "డబ్బులేవి మరదలా" అంటూ చెయ్యి చాపాడుట...
౧౨౦౬. డిల్లీ డిల్లీయే, గల్లీ గల్లీయే!
౧౨౦౭. డిల్లీ వెళ్లి ఉల్లిగడ్డ తెచ్చాడుట...
౧౨౦౮. డిల్లీకి ఏలికైనా తల్లికి కొడుకే!
౧౨౦౯. తన్నితే బూరెలగంపలో పడ్డాట.
౧౨౧౦. తగినట్లు కూర్చెరా తంపులమారి బ్రహ్మ...
౧౨౧౧. తగిలించుకోడం సులభం, వదిలించుకోడం కష్టం.
౧౨౧౨. తడిగుడ్డతో గొంతు కోసినట్లు...
౧౨౧౩. తన అన్నం తానూ తింటూ, ఊరివాళ్ళకు భయపడాలి.
౧౨౧౪. తనకంపు తనకి ఇంపు, ఇతరుల కంపంటే ఏవగింపు.
౧౨౧౫. తనకు కానిది పండితేనేమి, మండితేనేమి...
౧౨౧౬. తనకు మాలిన ధర్మం, మొదలు చెడిన బేరం ...
౧౨౧౭. తనకు లేదని ఏడిస్తే ఒకకన్ను, ఎదుట వానికి ఉందని ఏడిస్తే మరోకన్ను పోయాయిట!
౧౨౧౮. తనకోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష...
౧౨౧౯. తన గుణము మంచిదైతే ఇంకొకర్ని తప్పుపట్టాలనిపించదు.
౧౨౨౦. తనదాకా వస్తేగాని తలనొప్పి బాధ తెలియదు.
౧౨౨౧. తనదైతే తాటి టెంక, ఇతరులదైతే ఈత గింజ...
౧౨౨౨. తన బలిమి కన్నా స్థానబలిమి మిన్న.

Posted in June 2018, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!