Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౧౫౧. కందకులేని దురద కత్తిపీట కెందుకు?
౧౫౨. విత్తనాన్ని బట్టే ఉంటుంది మొక్క జాతకం.
౧౫౩. తనను తప్పించి, తక్కిన వాళ్ళందరి మీదా పిడుగు పడాలని కోరుకున్నాట్ట!
౧౫౪. చెయ్య కాలినప్పుడల్లా ఆకు దొరకదు ...
౧౫౫. బళ్ళు ఓడలపైనా వస్తాయి, ఓడలు బళ్లమీదా వస్తాయి ...
౧౫౬. దొంగ చేతికే తాళంచెవులు ఇచ్చినట్లు ...
౧౫౭. క్రింద పడ్డా ఫరవాలేదు, మీసాలకు మన్ను అంటకపోతే చాలు - అన్నాడుట!
౧౫౮. ఆరు నెలలు సావాసం చేస్తే చాలు, వారు వీరవుతారు.
౧౫౯. కోడలు చేసిన తప్పు కొండంత.
౧౬౦. తల్లికి కూడు పెట్టని ఘనుడు, పినతల్లికి పాలు పోస్తాడా?
౧౬౧. తన తప్పయితే గోరంత, అవతలివాళ్ళదైతే ఆకాశమంత!
౧౬౨. ఆరంభ శూరునికి ఆర్భాటం ఎక్కువ.
౧౬౩. ఇంటికి పిలిచి ఆతిధ్యమిస్తే, ఇల్లే తనదన్నాడుట!
౧౬౪. ఈగను కప్ప మింగింది, కప్పను పాము మింగింది.
౧౬౫. ఈత గింజంత ఇచ్చి, తాట్టెంకంత లాక్కున్నాడుట!
౧౬౬. దూరపు కొండలు నునుపు.
౧౬౭. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు!
౧౬౮. పిడికిలి తెరవనంత వరకే అది రహస్యం.
౧౬౯. అతివినయం ధూర్త లక్షణం.
౧౭౦. ఘటన లేకపోతె ప్రతిఘటన తప్పదు.
౧౭౧. చెవులు కోస్తే, మేక చెప్పినమాట వినక చస్తుందా!
౧౭౨. అంగుట్లో అమృతం, ఆత్మలో విషం.
౧౭౩. అన్నపుష్టేగాని అక్షర పుష్టిలేదు.
౧౭౪. ఎరుక పిడికెడు ధనం.
౧౭౫. ఎంత బంగారు పళ్ళెం అయినా, గోడ చేరుపు లేందే నిలబడదు.
౧౭౬. సిరి ఉంటే చుట్టాలూ ఉంటారు.
౧౭౭. కంచు మ్రోగినట్లు కనకం మ్రోగదు.
౧౭౮. పిట్టల తగువుకి పిల్లి తీర్పు!
౧౭౯. కోతీ - రొట్టెముక్కా సామ్యంగా ...
౧౮౦. రామేశ్వరం వెళ్ళినా, శనేశ్వరం వెనకాలే వచ్చిందిట....
౧౮౧. వాగుకి వరద, వయసుకి పొగరు సహజం.
౧౮౨. చిల్లు బిందె లోకి ఎన్ని నీళ్ళు తోడినా నిండడం ఉండదు.
౧౮౩. కడగండ్లు కలకాలం ఉండబోవు ...
౧౮౪. గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నాడుట!
౧౮౫. తినమరిగిన కోడి నెత్తెక్కి కూసిందిట!
౧౮౬. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందిట!
౧౮౭. ఎక్కడున్నావే కంబళీ - అంటే, ఎక్కడ వేశారో అక్కడే ఉన్నాను - అందిట!
౧౮౮. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనౌతుoది.
౧౮౯. కడివెడు నీళ్ళ శుద్ధికి ఒక్క మజ్జిగ చుక్క చాలు.
౧౯౦. నుదుటనున్న రాత నూరు యోజనాలు పరుగెత్తినా ఎక్కడకీ పోదు...
౧౯౧. భక్తిలేని పూజ పత్రికి చేటు.
౧౯౨. అధిక రాబదికోసం ఆశపడితే అసలుకే మోసం వచ్చింది.
౧౯౩. పరుగెడుతూ పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
౧౯౪. కాశీ దాకా వెళ్లి గాడిద గుడ్డు వెంట తెచ్చాడుట!
౧౯౫. చెరపకురా చెడేవు!.
౧౯౬. పేదవాని కోపం పెదవికి చేటు.
౧౯౭. తాను తవ్విన గోతిలో తనే పడ్డట్లు...
౧౯౮. దిగితేగాని లోతు తెలియదు.
౧౯౯. చుట్టమై వచ్చి, దయ్యమై పట్టుకుందిట!
౨౦౦. ఏలినాటి శని ఏడూళ్ళు మార్చినా ఎటూ పోదు.

Posted in May 2018, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!