Menu Close
Tookiga page title
ప్రాచీన సంస్కృతిని పరిరక్షించే అద్భుత రేఖాకృతులు
Corn Maze

ఉత్తర అమెరికా ఖండంలో అక్టోబర్ నెలలో మొక్కజొన్న పంట చాలా బాగా వస్తుంది. అయితే కంకులు అన్నీ కోసేసిన పిదప, ఆ కాండాలను ఆకులతో అట్లాగే ఉంచి పెద్ద ‘మేజ్’ అని లోనికి ప్రవేశిస్తే బయటకు రావడానికి మహాచిక్కైన దారులతో నిర్మిస్తారు. అక్కడకు వెళ్లి ఆ మేజ్ లో నుండి బయటకు రావడం అనేది ఒక మంచి అనుభూతితో కూడిన ఆట. ఈ కార్న్ మేజ్ అన్ని వయసు వాళ్ళను ఎంతగానో ఆకర్షిస్తుంది.

Corn Mazeఅయితే ఈ మేజ్ యొక్క చరిత్రను గమనిస్తే, ఇది ఎన్నో వందల ఏళ్ల నుండి ఒక సంప్రదాయ క్రీడ గా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. పాత రోజులలో ముఖ్యంగా 16 వ శతాబ్దంలో రష్యాలో ఈ విధమైన చిక్కు దారులతో కష్టమై చాల తిరుగుళ్లుగల ప్రదేశాలను ఎంతో వ్యూహాత్మకంగా గడ్డితో మరియు కొన్ని చోట్ల రాళ్ళతో కూడా నిర్మించారు. వీటిని ఆంగ్లంలో labyrinth అని అంటారు.

Corn Maze

ఈ మేజ్ ల నిర్మాణం ముఖ్యంగా నాడు, నేడు కూడా ఒక విధంగా సమయాన్ని వెళ్ళబుచ్చడానికి అనువుగా రూపొందించారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆ మేజ్ లోపలి వెళితే మరల బయటకు రావడానికి కొన్ని గంటలు పడుతుంది. కొన్ని సందర్భాలలో మధ్యలో ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్లి బయటకు వెళ్ళే దారిని కనుక్కొని తదనుగుణంగా దారులు వెదుక్కొని బయటకు రావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ మేజ్ లోకి వెళ్లి దారితప్పి పోవడం అనే ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించవచ్చు.

Corn Maze
Posted in June 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!