Menu Close

page title

పిచ్చుక

Sparrow Bird

పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం - అనే జాతీయం అందరం వినే ఉంటాం. కిచకిచా శబం చేస్తూమానవులను పలకరించే పిచ్చుకలు నేడు అనేక కారణాల వలన చాలా వరకూ కనుమరుగవుతున్నాయి. కాకి తర్వాత మానవుల నివాసాల వద్ద జీవించే పక్షి పిచ్చుకే! పెంపుడు పక్షి కాకపోయినా అలాగే మన ఇళ్ళ చుట్టూ నివాసాలు ఏర్పరుచుకొని నివసిస్తుంటాయి పిచ్చుకలు.

పిచ్చుక ఒక  చిన్న పక్షి. ఆంగ్లంలో స్పారో అంటారు.

పిచ్చుకలు సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉంటాయి. చిన్న తోకతో పొట్టిగా ఉండే వీటి ముక్కు మాత్రం చాలా బలంగా వుంటుంది. పిచ్చుకలు గింజలను చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. కొండ పిచ్చుకలు పట్టణాల్లో ఉంటూ అన్నీతినడం అలవరచుకుంటాయి.

పిచ్చుకల్లో అనేక రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. మానవుల్లా అనేక జాతుల పిచ్చుకలున్నాయి. వెదురుపిచ్చుక, కొండపిచ్చుక, చెరుకుపిచ్చుక, ఊరపిచ్చుక, పొదపిచ్చుక, పేదపిచ్చుక –

ఇహ పిచ్చుక నామాలు వింటే మన నామాలు మరచిపోతాం. కలవింకము, కలానునాది, కాలకంఠము, చటక, చటకము, చిత్రపృష్ఠము.

పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో, ఆస్ట్రేలియా, అమెరికాలలో పట్టణ ప్రాంతల్లో నివసిస్తుంటాయి. అమెరికా పిచ్చుకలు ఎంబరిజిడే కుటుంబానికి చెందినవి.

మానవ జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల ఇందాక చెప్పుకున్నట్లు 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం'గా నేడు పిచ్చుకల  జీవితం పరిణమించింది. పిచ్చుక జాతి అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పిచ్చుకలు అంతరించి పోవడానికి కారణాలు గా చెప్పుకోవచ్చు.  పాపం ఆ చిరు జీవులు తినేందుకు ఆహారం, ఉండేందుకు గూళ్ళుకట్టుకునే చోటు కూడా కరువై పోయింది. సెల్యూలర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి. మనిషికి కనీసం రెండేసి ’సిం’లున్న smart ఫోన్స్ వీటి పాలిటి యములోళ్ళవుతున్నాయి.

కృత్రిమమైన పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించ వచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనిషికే లేని గూడు పిచ్చుకలకు ఏ ప్రభుత్వం ఏర్పరుస్తుంది!

గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లల్లో విరివిగా వుండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కొరకు వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరుకు వేలాడ దీసే వారు. పిచ్చుకల కలకలనాదం మనస్సును అదో లోకానికి తీసుకెళుతుంది.

ప్రస్తుతం పంటలు లేక పిచ్చుకలకు ఆహారం కరువై ఇంకా అనేక కారణాల వలన పల్లెల్లో అవి కనబడడం లేదు. నిజమైన పిచ్చుకలో ఇంచుమించు 35 జాతులున్నాయి.

(...సశేషం...)

Posted in April 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!