Menu Close
71. కాలం కొడుకును తినేసింది

చిన్నదానికి పెద్దదానికి నేనున్నానని చిరునవ్వుతో వచ్చే కొడుకా..
ఈ బాధలో కూడా నువ్వుంటే బాగుండేదిరా..కొడుకా...

యెదను తొలిచేస్తున్నది ఆవేదన మడక
నువ్వు లేవన్న నిజం తెలిసి కొడుకా...

పెదవుల మధ్య వికసించే చిరునవ్వు పువ్వు ఇకలేదని తెలిసి చిన్నబోయే చెల్లి..
నా పేగునుంచి నడిచిన తనువిక కానరాదని తల్లడిల్లే తల్లి...

కొడుకా..ఓ కొడుకా...యాడబోతివి...
యాడచూసిన నీజాడలే...
ఇనుపమంట కాడలై మనసుపైన వాతబెడుతున్నాయి...
నీ జ్ఞాపకాలే పదునైనా కొడవళ్ళై..గుండెను కోతకోస్తున్నాయి...
నిను పెంచిన ఈ చేతులతోనే..కట్టాలా ఏడుకట్ల పడక
నిను కాల్చుటకు పేర్చాలా...పుడకా..
ఇంతటి ఘోరం చూసైనా... నా ప్రాణం పోదేందిరా...కొడుకా...
నా ప్రాణమే..నువ్వు రా...నువ్వు లేక నెట్టా ఊపీరిని పీల్చేదిరా...కొడుకా...

చిన్నదానికి పెద్దదానికి నేనున్నానని చిరునవ్వుతో వచ్చే కొడుకా..
ఈ బాధల…

72. ఎక్కడుంది మానవత్వము

ఎక్కడుంది మానవత్వము
ఎక్కడుంది మానవత్వము
మనిషి వేషం కట్టిన మృగత్వం చేతిలో
ఆహారమాయే మానవత్వము

కాడె నమ్ముకుని
కటిక నేలపైన కష్టించే కర్మజల కంచంలో
ఆకలి కేకగా మిగిలిపోయే మానవత్వము
కొయ్యకు వేలాడే అంపశయ్యగా మారిపోయే మానవత్వము

ఎక్కడుంది మానవత్వము
ఎక్కడుంది మానవత్వము
మనిషి వేషం కట్టిన మృగత్వం చేతిలో
ఆహారమాయే మానవత్వము

సారా సీసా కొరకు చావు తండట్లాయ్యో
వారి వరుసలు మరిచి వయసు వేడి కత్తితో
మగువు పైన దాడయ్యో
డబ్బు అన్న జబ్బుమధ్య రొమ్ము పాలిచ్చిన తల్లే
నడిరోడ్డుపాలయ్యో
నీతి నియమాలన్నీ శవము పెట్టే భగవద్గీతయ్యో

ఎక్కడుంది మానవత్వము
ఎక్కడుంది మానవత్వము
మనిషి వేషం కట్టిన మృగత్వం చేతిలో
ఆహారమాయే మానవత్వము

అభివృద్ధి మెట్టుపై అడుగులేస్తున్నా
ఆడపిల్ల పుడితే కుక్కలపాలయ్యో
మనిషిరూపాన చుట్టూ... కాకుల్లా మనమున్నా
శవాలను కిలోమీటర్…

73. ఆత్మీయ బంధమది

కర్రపై వాలిన
అనుభవాల చిలుక చెప్పే అనుభూతులంటే
ఆ చిట్టి గువ్వకు ఎంతిష్టమో
చెవులు రిక్కించుకొని వింటది
ప్రతి చోటికి నీడై అనుసరిస్తూ

74. గుడిసె ఏడుస్తున్నది

నా కడుపులో
ఎలుకల్ని చంపడానికి
మందు కనిపెట్టిన మేధావులారా..
నా బిడ్డల కడుపులో ఎలుకల్ని చంపే మందు కనిపెట్టి ఉంటే
బాగుండేదని
ఆ గుడిసె మూగ వేదన చెందుతున్నది

75. వీళ్ళకు స్వాతంత్ర్యం రాలేదు

గిట్టలు అరిగేలా తిప్పి
కాడెద్దులతో పచ్చదనాన్ని పండించి
గిట్టుబాటు ధర లేక గిట్టిపోయే
పుడమి మాటున పుట్టగొడుగులైన పుడమి పుత్రులకు
స్వాతంత్ర్యం ఇంకా రాలేదు మరి..

తూర్పున ఎర్రరాయి మండగానే
తన గుడిసె పిల్లను వదిలేసి వెళ్లి
తన వెంట నడిచే పావురాయి
ఆ గుడిసె పిల్ల కంట్లో చూపుల ఒత్తులేసి ఎదురుచూస్తే గాని
గూడు చేరని ఆ దినసరి కూలికి
కూటికి సరిపడ సొమ్మును గూటికి చేర్చుకునే
స్వాతంత్ర్యం ఇంకా రాలేదు మరి..

తోలుజోళ్ళను కాళ్ళకు పరిచయం చేసి
సమాజం కళ్ళల్లో ఆనందభాష్ప నీళ్ళనుచూసే
ఆ చర్మకారుల చేతులకు సిరులను పోగేసుకునే
స్వాతంత్ర్యం ఇంకా రాలేదు మరి..

స్వాతంత్ర్యం రాలేని వాళ్ళు చాలానే ఉన్నారు
స్వాతంత్ర్య సంబరాలు చేసుకునే వారి ఆనందానికి
అగరబత్తై కరిగిపోతూ
పాపం కరిగిపోయే అగరబత్తీలకు ఏ పుణ్యం రాదట
వాటిని కరిగించిన వారికేనట సకల సౌభాగ్య స్వ…

76. బ్రతుకుపుస్తకం కదా

అక్కడ కన్నీటి ఊటలు
ఉబికుబికి పడుతుంటాయి

అక్కడ ఆనంద కెరటాలు
ఎగిసెగిసి పడుతుంటాయి

అక్కడ కష్టనష్టపర్వాలు
వడివడిగా నడుస్తుంటాయి

అక్కడ ఆత్మీయ అనురాగ తీగలు
ఇబ్బడిముబ్బడిగా అల్లుకుపోతాయి

అక్కడ ద్వేషపూరిత స్వార్ధాలు
గడిబిడిగా గతులు మార్చుతుంటాయి

అక్కడే
బాల్యం చిందేస్తుంటుంది
కౌమారం ఉరకలేస్తుంటుంది
యవ్వనం బరువులు మోస్తుంటుంది
వృద్ధాప్యం వెతలపావుతుంటుంది

ఎందుకంటే
నవరసాలతో స్నానం చేస్తూ తరించే
బ్రతుకుపుస్తకమే కదా ఈ జీవితం

77. జయహో కార్మిక

కలియుగపు విశ్వకర్మవి నువ్వే కార్మిక
నీ చెమటచుక్క స్పర్శ లేనిదే
ఈకాలపు మయసభల ఉనికే లేదిక
ఓ కార్మిక జయహో కార్మిక

నీ కరిగిన కండలే దేశనిర్మాణ పునాదులు
నీ చెమటచుక్కలే గుభాళించే చరిత రాతలు
నీ గుండెల బలములే నిర్మాణాల స్తంభాలు
నీ చద్దిమూటే భవితకు వేసెను బాటలు
నీవే కాయకష్టపు కురుక్షేత్రంలో నేటి కృష్ణుడివి

నీవు పట్టిన గడ్డపారలే ఘనకార్యాలకు మూలాధారం
నీవు మోసిన మూటలే ధనికస్వామ్యపు ప్రతిఫలం
నీవు ఎత్తిన రాళ్ళే సమాజానికి రక్షణభవనం
నీవు కట్టిన మేడే నీకు సలాం చేస్తుంది
ఓ కార్మిక జయహో కార్మిక

పొట్టచేతబట్టి
వలసదారి పట్టి
పద్మవ్యూహాన్ని తలదన్నే
రూపురేఖలకు రూపమిస్తూ
జీవితాన్నే ధారపోస్తూ
పరిమళించిన
అమరకోశపు పువ్వు నీవే కార్మిక
నీ …

78. బురద నవ్వింది

బురద నవ్వింది
ఆకలి ఆకును రాల్చే
అన్నపు పువ్వుకు పురుడోశానని

ఆ పువ్వుకు పరిమళం ఉందంటారేమో...?

నిండిన కడుపునడగండి
కళ్ళల్లో చూపిస్తుంది.

79. తినే తీరు మారింది

పూర్వం
మా అమ్మ ఊపిర్లను
పొయ్యి తినేసింది

ఇప్పుడు
ఆ పొయ్యిలను
గ్యాస్ స్టవ్ తినేసింది

నేడేమో
ఆ గ్యాస్ స్టవ్ తెమ్మని
నా భార్య నన్ను తినేస్తున్నది
తినే తీరు మారిందిగానీ
తినడం మారలేదు

80. దేవుడు తప్పు చేశాడు

నిజమే
దేవుడు తప్పు చేశాడు
మానవ జన్మకు అర్హతలేని నన్ను
మనిషిగా పుట్టించాడు
మైధున క్రీడలో ఆకారమైన నన్ను నిరాకారం చేయలేక
అలనాడు
దేవుడు తప్పు చేశాడు

నిజమే
దేవుడు తప్పు చేశాడు
బాల్య స్వేచ్ఛకు స్థోమతలేని నన్ను
బాలుడిగా చేశాడు
శైశవవనంలో సమస్యల పాన్పుపై పడుకున్న
నా ఊపిరిని ఊదేయకుండా
ఆనాడు
దేవుడు తప్పు చేశాడు

నిజమే
దేవుడు తప్పు చేశాడు
అమాయకత్వ ఆవరణలోంచి బయటకు రాని నన్ను
యవ్వనంలోకి తెచ్చాడు
యక్షప్రశ్నలతో కక్ష సాధించే ఈ ఇక్కట్ల లోకంలో
నా ప్రాణాలు తీయకుండా
నేడు
దేవుడు తప్పు చేశాడు

కనిపించే రాయిలో కనిపించకుండా కొలువైనా ఓ దేవుడా
నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను నిను తప్పుబట్టలేదు
ఇప్పుడైనా
కనిపించే ఈ దేహాన్ని కనిపించకుండా ఓ ఒప్పైనా చేయరా
నా కోరిక తీరాలని కన్నీటితో నీకు అభిషేకం చేస్తున్నాను
నా మొర ఆలకించరా
భూ పొరల కింద …

... సశేషం ....

Posted in August 2021, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *