Menu Close
Kadambam Page Title
నీవు ఒక ID - నీ నవ్వే password
శ్రీ సాహితి

ఓ నాడు
బంధానికి బాధ్యులమై
ఆ అందానికి ఆరాధ్యులమై
నీవు ఒక I D గా
నీ నవ్వే password గా
కొన్ని "మధురక్షణాలను"
నా మనసు ఖాతాలో జమచేశావు.

మనసైన సమయంలో
మాట గుర్తొచ్చిన వేళకు
నడిసొచ్చిన జ్ఞాపకమే
నా లోపల సంతకమై భరోసానిచ్చావు.

తియ్యని కనువిందులో
మాటల కేరింతలో
హద్దుపొద్దులేని ఆనందం పొర్లి
hang ఐన ఒక మాటకి
పలకరింపు Recharge కరువై
వెలుగు on కాక
మౌనంగా off అవుతూ,
బతుకులో విలువగల software కాస్తా
Out dated అవుతుంటే..
దాగిన మనిషిలో దాచని మనసుతో
సమస్యతో నడచిన ఆలోచనకు
పరిష్కారానికి నడిచిన ఆవేశానికి
మనసు updating ఐతేనే
నీ చూపుతో మరో password
సృష్టించి
నిన్ను తెరుచుకొని activate ఐతేనే
నాకై జమ చేసిన మధురాలను
అనుభవించేది అని తేలింది.

ఈ బంధం network లో
బాధ్యత Wi-Fi గా
ప్రతిక్షణం ఒకరినొకరు download కావడమే సృష్టిలోని రహస్యమని,
జీవితమనే system లో
ఇష్టమైన గొప్ప software
"LOVE" ఒక్కటని
నాలో అనివార్యమైన ఈ link address
నీకు అనుసంధానించిన power
మనసొక్కటే అన్నిటికీ తెలిసి నన్ను నీకు online లో ఉంచుకున్నాను .

ఏ అంతరాయం లేని ఓ satellite connection తో
నిరంతరభావజాలం మనలో
జీవన అంతర్జాలమై కొనసాగేలా....

Posted in May 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!