Menu Close

Tookiga page title

నవ్వుకుంటూ మనసారా ఆనందిద్దాం

ఈ శీర్షికలో ఎప్పుడూ ఎదో ఒక విషయం గురించి వ్రాయడం జరుగుతున్నది. అది వైజ్ఞానికం కావచ్చు, చరిత్ర కావచ్చు, ఆరోగ్య రహస్యం, వింతలు... ఇలా రకరకాలు. అయితే అది ఒక పాఠంగా అందరికీ అనిపించి బోర్ కొట్టడం జరగవచ్చు. అందుకని ఈ సంచికలో ఏదైనా విభిన్నంగా ‘టూకీగా’ ఏమి వ్రాద్దామని ఆలోచిస్తుంటే, ఈ మధ్యనే నాకు మా స్నేహితుడొకరు షేర్ చేసిన ఈ తలతిక్క సమాధానాలు నాకు గుర్తుకు వచ్చాయి. వాటిని మీతో పంచుకొంటున్నాను. ఓపికగా ఈ ప్రశ్నలు, సమాధానాలు తయారుచేసి తద్వారా మనందరికీ ఎంతో మనోల్లాసాన్ని అందించిన ఆ వ్యక్తి ఎవరైననూ వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. ఇది అందరూ హాయిగా నవ్వుకోవడానికి మాత్రమే.

  • తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
    జవాబు: కట్టిన చోటే!
  • చలికాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?
    జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.
  • రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
    జవాబు: రసం తీసి!
  • గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు?
    జవాబు: నుదుటికి!
  • బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
    జవాబు: పట్టినంత మంది!
  • ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు?
    జవాబు: ఒలుచుకొని
  • హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు?
    జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు!
  • నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?
    జవాబు: మెలకువ వస్తుంది.
  • రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లు ఎందుకు పెడతారు?
    జవాబు: డ్రైవర్ ని నిద్ర లేపడానికి.
  • సెల్ ఫోన్ పోతే ఏమౌతుంది?
    జవాబు: మనశ్శాంతి ఫ్రీగా వస్తుంది.
  • నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?
    జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి.
  • టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం?
    జవాబు: ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి!
  • అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?
    జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని.
  • స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది.?
    జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని.
  • పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు?
    జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి.
Posted in September 2018, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!