Menu Close
Mana Telugu Velugu

నా తెలుగు తేజం – ఇలవెలుగు సంకేతం

నా తెలుగు జీవనం – దశదిశల పావనం

నా తెలుగు కమ్మన – నా నుడులు తీయన

నా భాష తిక్కన – నా శ్వాస పోతన

నా ఊసు వేమన – నా యాస తిమ్మన

నా అందం కందుకూరి – నా ఛందం దువ్వూరి

నా నుడి గురజాడ – నా బడి గిడుగు జాడ

నా కనులు కృష్ణా గోదావరీలవరి

నా మడులు పెన్నా తుంగభధ్రల సిరి

పాట మురిసె విశ్వనాథుని కిన్నెరసాని యై

మాట విరిసె సినారె విశ్వంభరవాణి యై

శాతవాహన చాళుక్యులేలిన కోటిలింగాల

కాకతీయులు రాయలేలిన త్రిలింగాల

మన్యం వీర అల్లూరి ఆంధ్రకేసరి టంగుటూరి

కొమరంభీం కన్నెగంటి హనుమంతుల ఉరి

అటు వేములవాడ – ఇటు విజయవాడ

అట గోల్కొండ, హనుమకొండ – ఇట పెనుగొండ, నాగార్జున కొండ

త్రిలింగదేశాన సంస్కృతీ సాంప్రదాయాలు

తెలంగాణ ఆంధ్రల అనుంగు ప్రేమానురాగాలు

నుదిటి బొట్టు పంచె కట్టు చీర కట్టు

వేప చెట్టు చెరువు గట్టు పొలం గట్టు

పచ్చడన్నం పరమాన్నం సంకటి

పప్పు ఆవకాయ తొక్కు అంబలి

అన్నీ కలగలిసిన

ఎన్నో కలబోసిన

యాబదారు అక్షరాల అనుబంధాలు

గుండ్రని భావాల అజంత అంద చంధాలు

అదే నా తెలుగునేల అనుబంధం

ఇదే కదా సదా నా జాతి సుమగంధం

అవును కదా నా తెలుగుతేజం

దేశ దేశాల వెలుగు నైజం

Posted in February 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!