Menu Close
mg

మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

ఈ అక్టోబర్ సంచికలో ఆలయసిరి ఏఆలయం మీద వ్రాస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే మహాబలిపురం ఎందుకో స్ఫురించింది. భారతీయ శిల్ప కళాజగతికి కీరీటం పెట్టిన ఈ ఆలయాన్ని పన్నెండు వందల సంవత్సరాల క్రితం పల్లవ రాజుల కాలంలో సముద్రపుటొడ్డున అత్యంత రమణీయంగా నిర్మించారు. నాడు ఈ మహాబలిపురం ప్రముఖ ఓడరేవుగా కూడా ప్రసిద్ధి చెందింది. మరి ఇలాంటి చారిత్రిక విషయాలను సినిమా పాటల రూపంలో వివరిస్తే ఎవరికి ఆ ప్రదేశం మీద ఆసక్తి కలగదు? 1970 సంవత్సరంలో విడుదలయిన ‘బాలరాజు’ సినిమాలో ఈ మహాబలిపురం గురించి ఎంతో వివరంగా ఒక పాటను మహాకవి ఆరుద్ర గారు రచించగా, కె.వి మహదేవన్ స్వరకల్పనలో సుశీల గారు తన గాత్రంతో ఆ పాటకు వన్నె తెచ్చారు. ఆ మధుర పాటనే మీకోసం అందిస్తున్నాను.

పల్లవి:

మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
బారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
బారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం 1:

కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు
కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్నం గా కట్టించాడు

తెలుగుసీమ  శిల్పుల్ని రప్పించాడు
తెలుగుసీమ శిల్పుల్ని రప్పించాడు
పెద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం 2:

పాండవుల రథాలని పేరుపడ్డవి
ఏకాండి శిలలనుండి మలచపడ్డవి
పాండవుల రథాలని పేరు పడ్డవి
ఏకాండి శిలలనుండి మలచపడ్డవి

వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి
వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం
మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం

పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం 3:

పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపసు
పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపసు

సృష్టంతా కదలివచ్చి చూడసాగెను
సృష్టంతా కదలివచ్చి చూడసాగెను
ప్రతి సృష్టి కి ఈ శిల్పమని పేరు వచ్చెను
ప్రతి సృష్టి కి ఈ శిల్పమని పేరు వచ్చెను
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

సంద్రంలో కలసినవి కలసిపోయేను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను
సంద్రంలో కలసినవి కలసిపోయేను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను

దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం
పాదాలను కెరటాలు కడుగును నిత్యం
మనుషులపాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం
పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం

మహబలిపురం మహబలిపురం మహబలిపురం
బారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

Posted in October 2019, పాటలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!