Menu Close
mg

మధురం మధురం ఈ సమయం

ఎస్. రాజేశ్వరరావు గారి సంగీత స్వర కల్పన ఎంతో సుమధుర స్వరఝరి తో మనలను ఇట్టే ఆకట్టుకుంటుంది. భార్యాభర్తల మధ్యన ఉన్న అన్నోన్య దాంపత్యానికి ప్రతీకగా ఏకాంత సమయంలో వారిలో కలిగే భావావేశ ప్రకంపనాలను కళ్ళకు కట్టినట్టు చూపుతున్న ‘భార్యాభర్తలు’ చిత్రం లోని ఈ శ్రీ శ్రీ గీతానికి ఘంటసాల, సుశీల గార్ల గాత్రం తోడైతే ఇక ఈ పాట మధురం కాక మరేమిటి. జీవితం ఆనందకరం కాకుండా ఉంటుందా?

పల్లవి:

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం 1:

చల్లని పున్నమి వెన్నెలలో.. ఓ ఓ ఓ ఓ ఓ ...
ఎన్నడు వీడని కౌగిలిలో.. ఆ ఆ ఆ ఆ ....
చల్లని పున్నమి వెన్నెలలో.. ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం 2:

కరగిపోయె పెను చీకటి పొరలూ.. ఊ ఊ ...
కరగిపోయె పెను చీకటి పొరలూ
తొలగిపోయె అనుమానపు తెరలు.. తొలగిపోయె అనుమానపు తెరలు
పరిమళించె అనురాగపు విరులు.. పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందన వనముగ

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం 3:

సఫలమాయే మన తీయని కలలూ..ఊ ఊ ...
సఫలమాయే మన తీయని కలలు
జగము నిండె నవజీవన కళలు.. జగము నిండె నవజీవన కళలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు.. పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగా

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Posted in August 2021, పాటలు