Menu Close
page title

గత సంచిక తరువాయి »

లకుముకి పిట్టలు

King Fisher Bird
బల్లిని పట్టుకుతినే సైఫన్ లా కాలరున్న కింగ్ఫిషర్

అరణ్యాలలో నివసించే అనేక కింగ్‌ఫిషర్ల వలే పసుపు-ముక్కు ఉన్న కింగ్‌ ఫిషర్ గూటిని వృక్షపు మొదలుకున్నమానులో పెడతాయి.  అక్కడే ఉన్న చెదలను తింటాయి.

King Fisher Bird
గూటిని చెట్టు మొదళ్లలో పెట్టే పసుపు-ముక్కు ఉన్న కింగ్ ఫిషర్

ఓరియంటల్ డ్వార్ఫ్ కింగ్‌ఫిషర్‌ను దుశ్శకునంగా బోర్నియో యొక్క డుసుం తెగ యోధులు భావిస్తారు.

King Fisher Bird
బోర్నియో యోధులు దుశ్శకునంగా భవించే ఓరియంటల్ డ్వార్ఫ్ కింగ్ఫిషర్

ఆకుపచ్చ లకుముకి పిట్టలు, రెండు పెద్ద పింఛాలున్న కింగ్ఫిషర్లు, అనేకరంగుల కింగ్ఫిషర్ ఆఫ్రికా మరియు ఆసియా అంతటా విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. ఆస్ట్రేలియా యొక్క ఎరుపు-రంగు కింగ్ఫిషర్ ఎడారులలో జీవిస్తాయి.

వ్యవసాయపు ప్రాంతాలలో మరియు నగరాలలో, పట్టణాలలో ఉన్న తోటలు ఉద్యానవనాల్లో కూడా అల్పసంఖ్యలో నేడు వీటిని చూడవచ్చు.

కింగ్ఫిషర్ అతిచిన్న జాతిపిట్ట. ఆఫ్రికన్ డ్వార్ఫ్ కింగ్ఫిషర్ (ఇస్పిడిన లెకోంటీ ), సుమారుగా 10.4 గ్రా, 10 సెం.మీ (4 అంగుళాలు) ఉంటాయి. మొత్తం మీద అతిపెద్దది జైంట్ కింగ్ ఫిషర్ (మెగాసెరిల్ మాక్సిమా ) సగటు బరువు కేవలం 355 గ్రా (13.5 ఔన్సులు) మరియు 45 సెమీ (18 అంగుళాలు) ఉంటాయి. కొన్ని పెద్ద జీవులు 450 గ్రాముల బరువుతో చాలా అరుదుగా కనిపిస్తాయి.

చాలావరకు ఈ కింగ్ఫిషర్ల ఈకలు ముదురు రంగుతో, ఆకుపచ్చ, నీలం రంగులలో చాలా అందంగా ఉంటాయి.

చేపలు వేటాడే జాతి కింగ్ ఫిషర్లు పొడవాటి, సూదివంటి-ముక్కుతో ఉంటాయి. ఈ ముక్కు సాధారణంగా పొడవుగా లోపలికి నొక్కుకొని ఉంటుంది. భూమిమీద ఆహారం కొరకు వేటాడే వాటికి పొట్టిగా ఉన్న వెడల్పాటి ముక్కు ఉంటుంది. అతి పెద్దదైన విలక్షణమైన ముక్కు ఉండే కింగ్ ఫిషర్ ఆహారం కోసం అడవి నేలను త్రవ్వటానికి ముక్కును ఉపయోగిస్తుంది. అవి సామాన్యంగా చిన్న కాళ్ళను కలిగి ఉంటాయి, వీటిలో చాలా జాతులు నాలుగు కాలి వేళ్ళను కలిగి ఉంటాయి. ఇందులో మూడు వెళ్ళు ముందుకు ఒక వేలు వెనుకకు  ఉంటాయి.

చాలా జాతులలో కనుపాపలు ముదురు ఊదా రంగులో ఉంటాయి. కింగ్ ఫిషర్లు దుర్భిణీ దృష్టి సామర్థ్యాన్ని వంటి మంచి కంటిచూపును కలిగి ఉంటాయి. వాటి కళ్ళ కదలికను కళ్ళ గుంటలలోకి పరిమితం చేస్తాయి. దానివల్ల ఆహారం వెతకటం కోసం తలను కదిలించవలసిన పనిలేదు. అంతేకాక, అవి నీటి వక్రీభవనాన్ని, వేటాడేప్పుడు నీడను నీటిలో చూడటానికి ఉపయోగించుకుంటాయి. నీటి యొక్క లోతును ఖచ్చితంగా  ఊహించగలవు.

కింగ్ ఫిషర్ అతి చిన్న జాతిపిట్ట అని చెప్పుకున్నాం కదా! ఆఫ్రికన్ డ్వార్ఫ్ కింగ్ ఫిషర్ (ఇస్పిడిన లెకోంటీ), సుమారుగా 10.4 గ్రా,10 సెం.మీ (4 అంగుళాలు) ఉంటాయి. మొత్తం మీద అతి పెద్ద కింగ్ ఫిషర్, మెగాసెరిల్ కింగ్ఫిషర్లు చేపలు లభించే ప్రాంతాల్లో ఎక్కువగా నివశిస్తాయి.

King Fisher Bird

కింగ్ ఫిషర్లు అనేక రకాల వాటిని ఆహారంగా తీసుకుంటాయి. అవి చేపలను వెంటాడి తినటంలో చాలా నేర్పరులు. కొన్ని జాతుల కింగ్ ఫిషర్లు జలచరాలను, చేపలనే కాక ఇతర ఉభయజీవులు, అన్నెలిడ్ క్రిములు, మలస్కాలు, కీటకాలు, సాలెపురుగులు, జెర్రులు, సరీసృపాలు, పాములతో సహా అన్ని జేవాలను తింటాయి. ఆహారాన్ని చూసిన వెంటనే కింగ్ఫిషర్ దానిని లాక్కొని తినటానికి చెట్టునుంచి కిందకు దిగివచ్చి ఆహారాన్ని ముక్కుతో పట్టుకొని తిరిగి కొమ్మ మీదకు వెళ్ళి పోతుంది. మూడు తెగలకు చెందిన కింగ్ఫిషర్లు వేటాడిన ఆహారాన్ని చంపటానికి గట్టిగా కొమ్మకు వేసి కొడతాయి, వాటి సంరక్షణగా ఉన్న బొమికలు , వెన్నుముకలను విరగకొడతాయి. వేటాడిన ఆహారాన్ని ముక్కలు చేసిన తరువాత దానిని నేర్పుగా మింగుతాయి. శతకోటి ఆకళ్ళకు అనంతకోటి ఉపాయాలు.

చాలా జాతుల లకుముకి పిట్టలు నేల మీద త్రవ్విన రంధ్రాలలో గూళ్ళను చేసుకుంటాయి. ఇవి నదులు, సరస్సులు, మానవులు త్రవ్విన గుంటలు, నదీ తీరాల ప్రక్కనున్న భూమిలో ఉంటాయి. ఈ సొరంగాల చివర ఒక గది వంటి ఆకృతిలో తమ గూళ్ళను ఏర్పరుచుకొంటాయి. గూడు త్రవ్వకాల బాధ్యతలను మగ, ఆడ పిట్టలు సమానంగా పంచుకుంటాయి; త్రవ్వకాలు చేసినప్పుడు ఈ పక్షి ఎంపిక చేసుకున్న ప్రదేశానికి వేగంతో ఎగిరిపోతుంది. పక్షులు ఇలాంటి సమయాల్లో  మరణించే లాగా గాయపడతాయి. అతివేగం ప్రాణ హాని అని వాటికి తెలీదుపాపం.

కింగ్ఫిషర్ల గుడ్లు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. తడవకు సగటున దాదాపుగా 3 నుండి ఆరు గుడ్ల వరకు పెడుతుంటాయి. కొన్ని జాతులు 10 గుడ్ల వఱకు కూడా పెడతాయి. మగ, ఆడ పక్షులు రెండూ గుడ్లను  పొదుగుతాయి. కింగ్ ఫిషర్లు సాధారణంగా సిగ్గుతో కూడిన పక్షులు, వీటి ఆకర్షణీయమైన రెక్కలు కొన్ని జాతుల ఆసక్తితో కూడిన ప్రవర్తనా పధ్ధతుల కారణంగా మానవ సంస్కృతితో వీటిని ఎక్కువ పోలిక ఉన్నట్లు తెలుస్తుంది.

మానవులు తమ అవసరాల కొఱకు అడవులను కొట్టివేయడం వలన ఈ చిన్ని ప్రాణులు తమ నివాసాలు కోల్పోయి, గూడు లేక గ్రుడ్లు పెట్టే చోటు లేక అంతరించి పోతున్నాయి. ఈ చిన్ని అందాలను మన చూసి ఆనందించాలంటే వాటికి సరైన రక్షణ కల్పించాలి.

 

*** సశేషం ***

Posted in February 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!