Menu Close

page title

కౌజు పిట్ట

Japanese Quail

కౌజు పిట్టను తెలుగులో కముజు పిట్ట, కవుజు పిట్ట, కంజు పిట్ట, కౌంజు పిట్ట, తిత్తిరి పిట్ట,

అడవి పూరేడు పిట్ట, అడవి పూరి పిట్ట, పరిఘ పక్షి అని వివిధ ప్రదేశాలలో అంటుంటారు. ఈ పక్షి చిన్నదిగా ఉండి, చూడటానికి గుండ్రంగా బొద్దుగా ఉంటుంది.

ఇది గువ్వజాతికి చెందిన అడవి పూరి పిట్ట. సంస్కృత భాషలో దీనికి అనూపము, కంజు, కపింజలము, కముజు, కలానునాది, జాంగలము ఇత్యాది నామాలున్నాయి.

12వ శతాబ్దంలోనే మానవ జాతి ఈ పక్షి ఉనికిని గుర్తించినట్లు ఆధారాలున్నాయి.

మానవులకు ఎన్నిరకాలు తిన్నా, ఎంత తిన్నాచాలదు కనుక మాంసాహారం కొరకు మానవులు జంతువులను, పక్షులను పెంచుకుని వాటినే తినడం జరుగుతున్నది.

సాధారణంగా మనవులు కోళ్ళను ఆహారంకోసం పెంచుకోడం మనం చూస్తున్నాము. అలాగే కోడి గుడ్లను కూడా తింటుంటారు.

అదే రీతిలో ఈ కౌజు పిట్టల పెంపకం నేడు జరుగుతున్నది. బ్రతికి ఉన్న కౌజు పిట్ట తన బరువులో 70 శాతం బరువుగల మాంసం కలిగి ఉంటుంది. అందుకే ఈ చిన్ని జీవిపై అంతులేని ప్రేమ. సాధారణంగా, 140 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్ట నుండి 100 గ్రాముల మాంసం వస్తుంది. అందుకే మానవులు వీటినిసైతం పెంచుకుంటున్నారు.

ఏడు వారాల వయసుకే  కౌజు పిట్టలు గుడ్లు పెడతాయి. మంచి గుడ్ల ఉత్పత్తి కోసం, 8–10 వారాల వయసు గల మగ కౌజు పిట్టలు, ఆడ కౌజు పిట్టలతో పాటు పెంచుతారు.

వన్య పక్షులు తమ గుడ్లను రక్షించుకోను దాచిపెట్టడానికి సులభంగా వీలుండే రంగుల్లో గుడ్లను పెడతాయి. కౌజు పిట్ట గుడ్లు చాలా చిన్నవిగావుంటాయి. కానీ ఎక్కువ సంఖ్యలో సంవత్సరానికి 300 లకు పైగా గుడ్లను పెడతాయి.

కోడిపిల్ల మాంసం కంటే కూడా కౌజు పిట్ట మాంసం రుచిగా ఉండటాన మానవులదృష్టి ఈ కౌజు పిట్టల మీద పడింది.

Posted in May 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!