Menu Close
mg

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

మాధుర్యప్రధానమైన పాటలు పాత కొత్త అనే మాటలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ వినాలనే భావనను మిగులుస్తాయి. అట్లాంటి కోవలోకి చెందినదే 1983 సంవత్సరం విడుదలైన సితార చిత్రంలోని ఈ కిన్నెరసాని పాట. ఎంతో భావయుక్తమై, ప్రకృతి ఒడిలో ప్రవహిస్తున్న కిన్నెరసాని నది అంచున చిత్రించిన ఈ పాట చూడటానికి కూడా ఎంతో హాయిగా ఉంటుంది.

విశ్వనాధ కవితై... అది విరుల తేనెచినుకై..కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పై పంక్తులు చాలు ఆ పాటను రచించిన వేటూరి గారి సాహిత్య పటిమను చూపడానికి, అలాగే ఇళయరాజా గారి స్వరఝరిని వర్ణించాలంటే మాటలు చాలవు. ఇంకెందుకు ఆలస్యం. పాటను వింటూ నేర్చుకుందాం పదండి.

చిత్రం: సితార (1983)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ

పల్లవి:

తననననన తననననన...
తననననన తననననన...
తననననన తననననన... తననననన

చమకు చమకు జింజిన జింజిన..
చమకు చమకు జిన్న జిన్న జిన్న..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
జమకు జమకు జింజిన జింజిన..
జమకు జమకు జిన్న జిన్న జిన్న..

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై... అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
పచ్చని చేలా..  పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

చరణం 1:

ఎండల కన్నె సోకని రాణి.. పల్లెకు రాణి పల్లవ పాణి..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కోటను విడిచీ.. పేటను విడిచీ..

కనులా గంగా పొంగే వేళ.. నదిలా తానే సాగే వేళ..
రాగాల రాదారి పూదారి ఔతుంటే..
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

చరణం 2:

మాగాణమ్మా చీరలు నేసే.. మలిసందెమ్మ కుంకుమ పూసే..
మువ్వలబొమ్మా....  ముద్దులగుమ్మా..
మువ్వలబొమ్మా....  ముద్దులగుమ్మా..

గడపా దాటి నడిచే వేళ..
అదుపే విడిచీ ఎగిరే వేళ..
వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే..
ఈ వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై... అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
పచ్చని చేలా..  పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని

Posted in July 2018, పాటలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!