Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౬౨౧. ఇల్లలుకగానే పండుగ రాదు.

౬౨౨. ఆకాశానికీ ఐశ్వర్యానికీ అవధుల్లేవు.

౬౨౩. పాముకు పాలుపోసినా, అది విషమే కక్కుతుంది.

౬౨౪.అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికో పోగు.

౬౨౫. లేవలేని అత్తకి ఓపలేని కోడలు.

౬౨౬. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది.

౬౨౭. నిప్పుతో ఆడితే ముప్పు తప్పదు.

౬౨౮. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు .

౬౨౯. కడుపు చీరుకుంటే కాళ్ళ మీదే పడుతుంది.

౬౩౦. అడుగువాడికి చెప్పువాడు లోకువ.

౬౩౧. అతి తెలివి వాని ఆవేశం వల్ల, అసమర్ధుడి మంచితనం వల్ల ప్రయోజనం శూన్యం.

౬౩౨. పేనుకి పెత్తనం ఇస్తే, బుర్రంతా చెడ గోరిగింది.

౬౩౩. ఆయనే ఉంటే ఇక మంగలోడి అవసరమేముంది!

౬౩౪. కట్టెల వంకర పొయ్యే తీర్చాలి.

౬౩౫. అరిచే కుక్క కరవదు.

౬౩౬. కాకిపిల్ల కాకికి ముద్దు.

౬౩౭. మాటకి మాట, వేటుకి వేటు.

౬౩౮. జరగని దానికోసం జగడమెందుకు!

౬౩౯. ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీలమోత!

౬౪౦. ఎరుక పిడికెడు ధనం!

౬౪౧. కొరనోములు నోచి, ఘనఫలాలు రమ్మంటే వస్తాయా ...

౬౪౨. పూజకొద్దీ పురుషుడు, దానంకొద్దీ బిడ్డలు.

౬౪౩. పిండాల్ని తెచ్చి పిల్లికి పెడతారా ఎవరైనా ...

౬౪౪. పురోడాశం కుక్కకి పెట్టినట్లు...

౬౪౫. అవకతవక బ్రాహ్మణుడికి అక్షతలిస్తే, అటు చూసి, ఇటు చూసి నోట్లో వేసుకున్నాడుట!

౬౪౬. ప్రాణం మీద తీపిపొతే సముద్రం మోకాలిబంటి అనిపిస్తుంది.

౬౪౭. చల్లకోసం వచ్చి ముంతదాచడం ఎందుకు?

౬౪౮. పరుల సొమ్ము పామువంటిది.

౬౪౯. కామెర్ల రోగికి లోకం పచ్చగా కనిపిస్తుంది.

౬౫౦. నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే లోకమంతా చీకటి అనిపిస్తుంది.

Posted in October 2019, సామెతలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!