Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౭౮౧. అయ్యగారి సాము నాలుగు గోడల నడుమనే...

౭౮౨. ఐనవారు లోతుకి తోస్తే, కానివారు గట్టుకి లాగారుట!

౭౮౩. అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు?

౭౮౪. ఆయుష్షు గట్టిదైతే అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ప్రాణభయం లేదు.

౭౮౫. అరచేతిలో ఉసిరికాయ ...

౭౮౬. అరఘడియ భోగం, ఆరునెలలు రోగం!

౭౮౭. అరిగినకొద్దీ గంధపు చెక్కకు పరిమళం పెరుగుతుందిగాని తరగదు.

౭౮౮. అరగని కూడు - జరగని మాట ఒకటి.

౭౮౯. ఏ అరటి చెట్టూ రెండుసార్లు గెల వేయదు.

౭౯౦. ఆవు పొదుగులో అరవై ఆరు పిండివంటలు ...

౭౯౧. అరటాకు వచ్చి ముల్లుమీద పడినా, ముళ్ళు వెళ్లి అరతాకుమీద పడినా నష్టపోయేది మాత్రం అరటాకే...

౭౯౨. అరవై దాటిన వాడిని ఆలోచన అడగకు, ఇరవై నిండనివానికి పెత్తనం ఇవ్వకు.

౭౯౩. అర్థబలం కంటే అంగబలం గొప్పది.

౭౯౪. ఆశీస్సులతో పిల్లలూ పుట్టరు, అర్జీలతో పనులూ జరగవు ...

౭౯౫. అలకాపురిని కొల్లగొట్టినా, అదృష్టహీనునికి దక్కేది ఏమీ ఉండవు.

౭౯౬. అల్ప విధ్వాంశుడికి ఆక్షేపణలు ఎక్కువ ...

౭౯౭. ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు...

౭౯౮. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అతిశయించక మానవు.

౭౯౯. అనిత్యాని శరీరాణి, అందరి ఆస్తీ నాకే రానియ్ - అన్నాడుట ఒకడు.

౮౦౦. అనుభవమే శాస్త్రం, అనుభవజ్ఞుడి మాటలే మంత్రాలు ...

౮౦౧. ఇంటింటికీ ఒకపువ్వు, ఈశ్వరునికి ఒకమాల!

౮౦౨. ఇంటికి గుట్టు, మడికి గట్టు ఉండాలి.!

౮౦౩. ఇంటికి దీపం ఇల్లాలే!

౮౦౪. మన ఇంటి దీపమే కదాని ముద్దుపెట్టుకుంటే మూతిమీది మీసాలు కాలిపోగలవు!

౮౦౫. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.

౮౦౬. ఇంటిపేరు కస్తూరి, ఇల్లంతా గబ్బిలాల వాసన!

౮౦౭. ఇంటిపేరు క్షీరసాగరం, ఇంట్లో చుక్క చల్ల కూడా లేదు.

౮౦౮. ఇంట్లో పిల్లి, బయట పులి.

౮౦౯. ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడు లోకువ.

౮౧౦. ఇచ్చేవాడుంటే చచ్చేవాడుకూడా లేచి చెయ్యి పడతాడు.

Posted in March 2020, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!