Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౧౦౮౧. గాలిలో మేడలు కట్టినా, కలలో రాజ్యాలేలినా ఒకటే...

౧౦౮౨. గుడిలో లింగాన్ని మింగుతానని ఒకడంటే, గుడినీ, గుడిలోని లింగాన్నీ - మొత్తం మింగేస్తానన్నాడుట ఇంకొకడు!

౧౦౮౩. గుడ్డెద్దు చేలో పడ్డట్లు...

౧౦౮౪. గుడ్డివానికి పగలూ రాత్రీ కూడా చీకటే!

౧౦౮౫. గుడ్డువచ్చి, పిల్లని వెక్కిరించిందిట!

౧౦౮౬. గుడ్డువచ్చి పిల్లను వెక్కిరించినట్లు ...

౧౦౮౭. గుమ్మడికాయల దొంగ - అంటే బుజాలు తడుముకున్నాడుట!

౧౦౮౮.  గుసగుసలాడుకుని, గుడిసెకు నిప్పెట్టారుట!

౧౦౮౯. గువ్వా గూడెక్కె, రాజు మేడెక్కె...

౧౦౯౦. గొంతుకలో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్లు...

౧౦౯౧. గొడుగుపైన గొడుగు పట్టినా పిడుగును ఆపలేము.

౧౦౯౨. గొడ్డుకైతే ఒక్క దెబ్బ, మనిషికైతే ఒక్క మాట!

౧౦౯౩. గొప్పగా తెలుసనుకున్నవారే ముందుగా గోతిలో పడతారు.

౧౦౯౪. గొర్రె ఎంత పెరిగినా తోక బెత్తెడే!

౧౦౯౫. గొర్రె కసాయిని నమ్ముతుంది.

౧౦౯౬. గొర్రెల మందలో తోడేలులా ...

౧౦౯౭. గొళ్ళెం లేని తలుపు, కళ్ళెం లేని గుఱ్ఱం ...

౧౦౯౮. గోచీకి ఎక్కువ, కోకకు తక్కువ ...

౧౦౯౯. గోచీకి మించిన దరిద్రమూ లేదు, ఈతకు అందని లోతూ లేదు.

౧౧౦౦. గోటితో పోయేదానికి గొడ్డలి తేకూడదు.

౧౧౦౧. గోడకు వేసిన సున్నం వీడేనికి పనికిరాదు.

౧౧౦౨. గోడమీది పిల్లి వాటం ...

౧౧౦౩. గోడలకు చెవులుంటాయి, నీడలకు నోళ్ళుంటాయి.

౧౧౦౪. గోధుమలు చల్లితే, బాదములు పండవు ...

౧౧౦౫. గోముఖ వ్యాఘ్రాలుంటాయి, జాగ్రత్త!

౧౧౦౬. గోరుచుట్టు మీద రోకలి పోటులా...

౧౧౦౭. గోవును గోలెం దాకా నడిపించగలంగాని, దానిచేత కుడితి తాగించలేము.

౧౧౦౮. గ్రాసం లేని కొలువు, రసం లేని కావ్యం ప్రయోజనకారులు కావు.

౧౧౦౯. ఘడియ ముందు హాజీ, మరుఘడియకు ఫాజీ!

౧౧౧౦. ఘడియ తీరికలేదు, దమ్మిడీ ఆదాయం లేదు.

Posted in December 2020, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!