Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౮౧౧ కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు?

౮౧౨. ఇటు చూస్తే వీరభద్రుడు, అటుచూస్తే హనుమంతుడు.

౮౧౩. ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇరుక్కుని చచ్చాడుట!

౮౧౪. ఇనుము కరిగే చోట ఈగలెలా బ్రతుకుతాయి?

౮౧౫. ఇనుము విరిగినా అతకవచ్చుగాని మనసు విరిగితే మరి అతకబడదు.

౮౧౬. ఎన్నో కంతులు కోశాను గాని, నా కంతి పెట్టినంత నొప్పి మరేదీ పెట్టలేదు - అన్నాడుట ఒక డాక్టరు.

౮౧౭. ఇరుసున కందెన పెట్టనిదే ఈశ్వరుని బండైనా నడవదు.

౮౧౮. ఇల్లలుకగానే పండుగ కాదు.

౮౧౯. ఇల్లే తీర్థం, వాకలే వారణాసి, కడుపే కైలాసం!

౮౨౦. దాహం మొదలయ్యాక నీళ్ళకోసం బావి తవ్వడం మొదలెట్టాడుట!

౮౨౧. ఇసుకను తాడుగా పేనలేవు.

౮౨౨. ఈగను కప్ప మింగితే, కప్పని పాము మింగుతుంది.

౮౨౩. ఈటె పోటు కంటే మాటపోటు క్రూరమైనది.

౮౨౪. ఈడు చూసి పిల్లనివ్వాలి, పిడి చూసి కొడవలి కొనాలి.

౮౨౫. ఈతచెట్టు పక్కన నిలబడి పాలు తాగినా కల్లే అంటారు.

౮౨౬. ఈనాడు ఇంటిలో, రేపు మట్టిలో - అనిత్యాని శరీరాణి...

౮౨౭. ఈవలి గట్టున మేస్తున్న ఆవుకి ఆవలి గట్టునున్న గడ్డి ఏపుగా  కనిపిస్తుంది.

౮౨౮. ఉండి చూస్తేగాని తెలియదు ఊరి అందం.

౮౨౯. ఉడతలు ఊపితే మాను ఊగదు.

౮౩౦. ఉద్యోగానికి ఒక ఊరూ కాదు, ముష్టికి ఒక ఇల్లూ కాదు..

౮౩౧. ఉన్న ఊరు కన్నతల్లివంటిది.

౮౩౨. ఉన్నది మనిషికి పుష్టి, తిన్నది పసరానికి పుష్టి.

౮౩౩. ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ.

౮౩౪. ఉన్నవాడి సొమ్ము వాడికే ఉంటుంది, లేనివాడి సొమ్మూ వాడికే చేరుతుంది.

౮౩౫. ఉపాయం లేనివాడిని ఊళ్లోంచి వెళ్ళగొట్టాలి.

౮౩౬. ఉపాయం ఉంటే అపాయం నుండి తప్పించుకోవచ్చు.

౮౩౭. ఉపాయం ఉన్నవాడు ఊరిమీద పడి బ్రతకగలడు.

౮౩౮. ఉప్పూ లేదు, కారం లేదు, అమ్మతోడు, కమ్మగుంది - అన్నట్లు ....

౮౩౯. ఉయ్యాలాలో బిడ్డ నుంచుకుని ఊరంతా వెతికారుట!

౮౪౦. ఉలిపికొట్టు కెందుకురా ఊరి సంగతి ...

Posted in April 2020, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!