Menu Close
Geethanjali-page-title

86

DEATH, thy servant, is at my door. He has crossed the unknown sea and brought thy call to my home.

The night is dark and my heart is fearful yet I will take up the lamp, open my gates and bow to him my welcome. It is thy messenger who stands at my door.

I will worship him with folded hands, and with tears. I will worship him placing at his feet the treasure of my heart.

He will go back with his errand done, leaving a dark shadow on my morning; and in my desolate home only my forlorn self will remain as my last offering to thee.

సీ. కాలమను జలధి కడచి‌ నీ దాసుడౌ
    కాలుడే నిలిచె నా గడపముందు

    చిమ్మచీకటి రాత్రి, చిత్తమందున భీతి
    నిండగా, గొనివచ్చె నీదు పిలుపు

    స్వామిదూతయతడు స్వాగతింతు, శిరసు
    వంచి పాదములంటి పలకరింతు

    కన్నీళ్ళ నర్చింతు కైమోడ్పు సేసతని
    చరణమ్ములందు నా సర్వమొసగి 

ఆ. అతని‌కార్యమతడు ఆచరించి వెడలె,
    వీడి నీలినీడ వేకువందు!!
    ఒంటియింటిలోన ఒంటరై యుంటి నే
    నర్పణమ్ము జేయనాత్మ నీకు!!

87

IN desperate hope I go and search for her in all the corners of my room; I find her not.

My house is small and what once has gone from it can never be regained.

But infinite is thy mansion, my lord, and seeking her I have come to thy door. I stand under the golden
canopy of thine evening sky and I lift my eager eyes to thy face.

I have come to the brink of eternity from which nothing can vanish ⎯ no hope, no happiness, no vision of a face seen through tears.

Oh, dip my emptied life into that ocean, plunge it into the deepest fullness.

Let me for once feel that lost sweet touch in the allness of the universe.

సీ. అడుగంటు ఆశతో ఆమెకై మాయింట
    యంతటా వెదకినే నలసిపోతి

    చిరుకుటీరము నాది చేయిజారిన దాని
    తిరిగిపొందుట యన్న తరము కాదు

    ఆకాశ హర్మ్యమై అలరునీ సౌధమ్ము!!
    ఆమెకై వెదకుచు అరిగితిటకు

    పసిడి పందిరి క్రింద పడమటి సంధ్యలో
    ముఖమెత్తి జూతునీ మోము వంక
ఆ. కనులనీరు మోము కప్పకుండునెచట
    నిలుచునెచట యాశ మలిగిపోక
    అంతులేనిదగు అనంతమౌ కాలమ్ము
    అంచు వద్దనిపుడు యాగి యుంటి

ఆ. నీదు జలధి, బ్రతుకు నిస్సార కలశమ్ము
    మునగ నిమ్ము స్వామి ముదముతోడ
    పొందనిమ్ము భువన పూర్ణత్వమొకసారి
    తన్మయత్వమందు తనిసి పోని

88

DEITY of the ruined temple! The broken strings of Vina sing no more your praise.

The bells in the evening proclaim not your time of worship. The air is still and silent about you.

In your desolate dwelling comes the vagrant spring breeze. It brings the tidings of flowers ⎯ the flowers that for your worship are offered no more.

Your worshipper of old wanders ever longing for favour still refused. In the eventide, when fires and shadows mingle with the gloom of dust, he wearily comes back to the ruined temple with hunger in his heart.

Many a festival day comes to you in silence, deity of the ruined temple. Many a night of worship goes away with lamp unlit.

Many new images are built by masters of cunning art and carried to the holy stream of oblivion when their time is come. Only the deity of the ruined temple remains unworshipped in deathless neglect.

సీ. శిథిల కోవెలనేలు యధిదేవతా నిన్ను
    తెగినతంత్రుల వీణ పొగడదింక

    పూజవేళను దెల్ప, మ్రోగవు గంటలు
    సంధ్యవేళల గాలి, సద్దు మాను

    పూలకారు పవనమ్ము గుడిలోనికి దెచ్చు,
    పూజకై రాలేని పూల వార్త

    వేచి వరమునకై, వేగిపోయి, చివర
    కలసి వెడలె పూర్వయర్చకుండు

ఆ. అగ్ని శిఖల ధూళియావరించిన వేళ
    దిగులు మనసులోన సెగలు రేగ
    తిరిగి వచ్చునతడు తీరని కోర్కెతో
    పాడుబడిన గుడికి బడలిపోయి

ఆ. పర్వదినము‌లెన్నొ వచ్చిమరలిపోయె
    వడిగ కాలగతిని సడియె లేక
    సంధ్య పూజలెన్నొ సాగిపోయెను, నీదు
    గర్భగుడిని దీపకళిక లేక

ఆ. శిల్ప స్రష్టలెన్నొ శిల్పాలు చెక్కినా
    కాల గర్భమందు కలిసి పోయె
    పాడుబడ్డ గుడిని పతనమ్ము కాలేక
    మూర్తి యటులె నిలిచె పూజ లేక

89

NO more noisy, loud words from me ⎯ such is my master's will. Henceforth I deal in whispers. The speech of my heart will be carried on in murmurings of a song.

Men hasten to the King's market. All the buyers and sellers are there. But I have my untimely leave in the middle of the day, in the thick of work.

Let then the flowers come out in my garden, though it is not their time and let the midday bees strike up their lazy hum.

Full many an hour have I spent in the strife of the good and the evil, but now it is the pleasure of my playmate of the empty days to draw my heart on to him; and I know not why is this sudden call to what useless!

సీ. గొప్పమాటలు లేవు, గోలసేయుట లేదు!!
    ఇదియె ప్రభుని ఇచ్ఛ ఇంక మీద

    ఎదలోని సొదలన్ని ఎరుకపరతు, నాదు
    పాటలో మెల్లగా ప్రభుని మ్రోల!!

    రాచనగరునకు రయమునేగిరి లోక
    వర్తకమ్మును కోరి, వణిజులంత

    వేళకాలేదు నే విరమించితిని కార్య
    భారమంతయు నేడు పట్టి లేక

ఆ. విరులు వనములోన వికసించదొడగనీ
    అడుగుపెట్టకున్న ఆమనియిటు
    కాలమాద మరచు రోలంబములు పూల
    నావరించనిమ్ము అలరులనటు

ఆ. మనసు నిన్నినాళ్ళు మంచిచెడుల మధ్య
    నలిపి వైచినాను అలుపులేక!!
    ఏమి పొందదలచి ఎద కట్టివేసెనో?
    అతని యాటలింక బ్రతుకు నాకు!!

90

ON the day when death will knock at thy door what wilt thou offer to him? Oh, I will set before my guest the full vessel of my life ⎯ I will never let him go with empty hands.

All the sweet vintage of all my autumn days and summer nights, all the earnings and gleanings of my busy life will I place before him at the close of my days when death will knock at my door.

ఆ. తలుపు తట్టి, యముడె, దర్శనంబిడినచో,
    ఎటుల జూతువతని కిత్తు వేమి?
    "ప్రాణకలశమిత్తు పదములన్ సేవింతు
    అతిథియైన యతని నాదరింతు

ఆ. ఆకురాలు దినము లాగ్రీష్మ యామినుల్,
    ఆశతో గడిపిన ఆయువంత,
    చిన్న నాటి గురుతులన్ని యొకటి జేసి
    అర్పణమ్ము జేతు నతని మ్రోల"

91

O THOU the last fulfilment of life, Death, my death, come and whisper to me!

Day after day have I kept watch for thee; for thee have I borne the joys and pangs of life.

All that I am, that I have, that I hope and all my love have ever flowed towards thee in depth of secrecy.

One final glance from thine eyes and my life will be ever thine own. The flowers have been woven and the garland is ready for the bridegroom.

After the wedding, the bride shall leave her home and meet her lord alone in the solitude of night.

సీ. మరణమా!! నీవెనా, మదిలోన కదలాడు
    చివరి కోర్కెవు, రమ్ము, చేరుకొనుము!

    కలతలన్ కుతుకమున్ చెలికాడవే నీవు!
    కాపుగాచితి నిన్ను రేపవళ్ళు!!

    నాయాశ నాప్రేమ నాదన్న సర్వమ్ము
    నిరతమ్ము నీవైపె పరుగుదీయు

    కడగంట నొకమారు కాంచిన చాలు, నీ
    చేతిలోనికి జారు జీవితమ్ము

ఆ. సిద్ధమయ్యె వధువు చేత పూమాలతో
    వరుని మెడను వేసి మురిసిపోవ
    తల్లియొడిని వీడి తనదుకాంతుని జేరు
    ఎవరులేని రాత్రి నవ వధువుగ!

92

I KNOW that the day will come when my sight of this earth shall be lost, and life will take its leave in silence, drawing the last curtain over my eyes. Yet stars will watch at night, and morning rise as before, and hours heave like sea waves casting up pleasures and pains.

When I think of this end of my moments, the barrier of the moments breaks, and I see by the light of death thy world with its careless treasures. Rare is its lowliest seat, rare is its meanest of lives.

Things that I longed for in vain and things that I got ⎯ let them pass. Let me but truly possess the things that I ever spurned and overlooked.

సీ. చూపునిలిచి పోవు నీభూమి నొకనాడు
    పరమసత్యమ్మిద నెరుగుదోయి

    సడిసేయక యవని పడిపోయి మెల్లగా
    సెలవుతీసికొనును జీవితమ్ము

    వినువీథి తారలు కనిపెట్టుకొని యుండు
    పొద్దుపొడుచునట్లె పుడమిపైన

    సుఖదుఃఖములు రెండు చూపించు కాలమ్ము,
    కడలిపై అలవోలె కదలునటులె!!

ఆ. చరమఘడియ వంక తరచిజూచితి! కాల
    మంతులేని‌ దయ్యె నడ్డు తొలగి!!
    మృత్యు కాంతినుండి సృష్టిలోని సిరుల
    కనగ యెరుక గలిగె కడకు నాకు

ఆ. అధమమైన జన్మ అపురూపమేయని!
    అధమ స్థానమెంతొ అరుదుయనుచు!!
    వ్యర్థ కోరికలను వదిలేయనీ స్వామి
    వాస్తవంబగు సిరి బడయనిమ్ము

93

I HAVE got my leave. Bid me farewell, my brothers! I bow to you all and take my departure. Here I give back the keys of my door ⎯ and I give up all claims to my house. I only ask for last kind words from you.

We were neighbours for long, but I received more than I could give. Now the day has dawned and the lamp that lit my dark corner is out. A summons has come and I am ready for my journey.

సీ. వీడుకోలు పలుక వేళయ్యెను చివరి
    అభివందనములివె యన్నలార

    ఇదియె గనుడు నేడు యిల్లు విడిచితి, నే
    నప్పగించితి నాదు హక్కులన్ని

    కోరకొననుమిమ్ము వేరేమియు, కొంత
    మనసుకూరట నిచ్చు మాట తప్ప

    కలిసియుంటిమి యెంతొ చెలిమితోడ మనము!
    బదులు చేయక పోతి, బడసిచాల!!

ఆ. పొడిచె పొద్దు నేడు, కొడిగట్టె నాగూడు
    చీకటి తొలగించు చిన్న దివ్వె
    పిలుపు వచ్చెనింక, వేగ పోవలె! నేను
    జీవయాత్రకిపుడు సిద్ధమైతి!!!

*** సశేషం ***

Posted in March 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!