Menu Close
Geethanjali-page-title

54

I ASKED nothing from thee; I uttered not my name to thine ear. When thou took'st thy leave I stood silent. I was alone by the well where the shadow of the tree fell aslant, and the women had gone home with their brown earthen pitchers full to the brim.

They called me and shouted, "Come with us, the morning is wearing on to noon." But I languidly lingered awhile lost in the midst of vague musings.

I heard not thy steps as thou camest. Thine eyes were sad when they fell on me; thy voice was tired as thou spokest low ⎯ "Ah, I am a thirsty traveller." I started up from my day-dreams and poured water from my jar on thy joined palms. The leaves rustled overhead; the cuckoo sang from the unseen dark, and perfume of babla flowers came from the bend of the road.

I stood speechless with shame when my name thou didst ask.

Indeed, what had I done for thee to keep me in remembrance? But the memory that I could give water to thee to allay thy thirst will cling to my heart and enfold it in sweetness.

The morning hour is late, the bird sings in weary notes, neem leaves rustle overhead and I sit and think and think.

సీ. తరలిపోవగనీవు, తరువునీడనెయుండి
నిశ్శబ్దముగ జూతు నిన్ను యటులె

మారుపలుకలేదు పేరుతెలుపలేదు
మనసులోమాటను మరుగు పరుతు

నెచ్చెలులందరు నీళ్ళకడవ నింపి
వెంటరమ్మనిబిల్వ వినక నేను

నాదుతలపులలో ఆదమరచి యుంటి
తిరుగుచుంటినటులె తరుల నడుమ

ఆ. ఆలకించనైతి అడుగుసవ్వడి, నీవు
చెంత నిలుచు వరకు చెవిని బడక
అలసియున్న నీదు ఆలోకనములోన
కంటి తెలియరాని కష్ట మెదియొ

సీ. బహుదూరమున వచ్చు పాంథుండనని నీవు
ఊహలన్ దేలు నన్ దాహమడుగ

కలవీడి కరములన్ కడవలో నీరు నీ
కరతలమున బోసి కదలకుంటి

నల్లతుమ్మ విరులు జల్లె సుగంధమ్ము
వినిపించె కలఘోష వనములోన

నిలుచుంటి సిగ్గుతో తలవంచి, నాపేరు
అడుగలేదంచునే నడుగుబడక

ఆ. కారణమ్ము లేదు, పేరు గురుతుయుండ!
చేసితేమి పెద్ద సేవ నీకు?
తలపులందు నీకు దాహమ్ము తీర్చు, ఆ
ఘడియ మధుర స్మృతిగ కదలు నోయి!

55

LANGUOR is upon your heart and the slumber is still on your eyes. Has not the word come to you that the flower is reigning in splendour among thorns? Wake, oh awaken! Let not the time pass in vain!

At the end of the stony path, in the country of virgin solitude my friend is sitting all alone. Deceive him not. Wake, oh awaken!

What if the sky pants and trembles with the heat of the midday sun ⎯ what if the burning sand spreads its mantle of thirst ⎯ Is there no joy in the deep of your heart? At every footfall of yours, will not the harp of the road break out in sweet music of pain?

సీ. ముళ్ళపై నెదవిప్పి, పూవు రాజ్యమునేలె
వింటివో యీయూసు వింతగొలుపు!

ఎదలోన అలుపేల నిదురేల కనులలో
జాగుసేయక నీవు వేగ చనుము

పాషాణ పథములో పరదేశమున వేచు
ఏకాంతముగ నాదు ఇష్టసఖుని

మోసగించకుమోయి ఆసద్రుంచకుమోయి
రేయి ముగిసె నింక లెమ్ము నిదుర

ఆ. గ్రీష్మ తాపమునకు కీలలెగసిపోయి,
వంగి వణకు గాక నింగియిపుడు!!
దాల్చి బీడు పరుపు దాహార్తితో నేడు,
సెగలగ్రక్కు గాక రగిలి  నేల!!

ఆ. హృదయకుహర మందు ముదము కాంచవదేల!
ఉల్లమందె అదిమి ఉంతువేల?
అడుగు బడిన చోట ఆర్ద్రమౌ గానమున్!!
పొంగి పాడ లేద పూల బాట!!

56

THUS it is that thy joy in me is so full. Thus it is that thou hast come down to me. O thou lord of all heavens, where would be thy love if I were not?

Thou hast taken me as thy partner of all this wealth. In my heart is the endless play of thy delight. In my life thy will is ever taking shape.

And for this, thou who art the King of kings hast decked thyself in beauty to captivate my heart. And for this thy love loses itself in the love of thy lover, and there art thou seen in the perfect union of two.

సీ. ఆనంద రసహేల అణువణువున నిండె
అవతరించగనీవు అవనిపైన

నన్ను కాదన్నచో, నాకాధిప దెలుపు
యెచటయుంచెద వోయి యింత ప్రేమ

నాకు భాగమొసగినావు నీ రచనలో 
నిరవద్యమై సాగె నీదు ఖేల

రూపుదిద్దుకొనెను నీప్రేమ నాలోన
రాగరంజితమాయె లాస్యమెదను

ఆ. రాజరాజువగుచు రమణీయ యాకృతిన్
కట్టివైతువెదను కదలనీక
నిన్ను కోలుపోయి నన్ను నిలిపెదీవు
ఇరువు రొక్కటన్న యెరుక పరచి

57

LIGHT, my light, the world-filling light, the eye-kissing light, heart-sweetening light!

Ah, the light dances, my darling, at the centre of my life; the light strikes, my darling, the chords of my love; the sky opens, the wind runs wild, laughter passes over the earth.

The butterflies spread their sails on the sea of light. Lilies and jasmines surge up on the crest of the waves of light.

The light is shattered into gold on every cloud, my darling, and it scatters gems in profusion.

Mirth spreads from leaf to leaf, my darling, and gladness without measure. The heaven's river has drowned its banks and the flood of joy is abroad.

సీ. కాంతి సంద్రమ్మహో! కప్పివైచె భువిని!!
కనులముద్దిడుకాంతి మనసు నింపె

నాట్యమాడెను కాంతి నాజీవికను సఖా!
వలపువీణను మీటి చెలగె కాంతి!

వినువీథి తెరదీసి వీచెగాలి వడిగ
తెరలతెరల నవ్వు ధరణి నిండె

వెలుగుకడలిపైన నిలిచి బారులుగ, సీ
తాకోక చిలకలు తనిసిపోయె

ఆ. పొంగిపోయి మల్లె పూలగుత్తులు, వెల్గు
నురగ పైన మురిసి విరిసి యాడె
వెలుగు జిమ్మి పసిడి జిలుగుయంచుగ మబ్బు
లాడుచుండె దేలి ఆకసమున

ఆ. అవధులేవి లేని ఆనంద వీచికల్
పత్రములను తాకి పరవశించె
గగనగంగ యురికి గట్లుతెంపెను, మోద
ముల్లమందు పొంగె వెల్లువగుచు

58

LET all the strains of joy mingle in my last song ⎯ the joy that makes the earth flow over in the riotous excess of the grass, the joy that sets the twin brothers, life and death,
dancing over the wide world, the joy that sweeps in with the tempest, shaking and waking all life with laughter, the joy that sit still with its tears on the open red lotus of pain, and the joy that throws everything it has upon the dust, and knows not a word.

సీ. అదుపులేక పెరుగు అడవిగరిక పైన,
పొ‌ంగి పరచుకొన్న పుడమి హృష్టి

జంటగా జన్మించు జననమరణముల
విశ్వనాట్యమునందు వెలయు తుష్టి

ఉర్విజీవులనెల్ల ఉప్పెనగ కుదిపి
జాగరూకుల జేయు సంతసమ్ము

అరుణాబ్జమైవెల్గు ఆర్తియంచుల నిల్చు
అశ్రుకణమ్ముపై హ్లాదనమ్ము

ఆ. చెంత నున్న దంత చిదిమిధూళిన వేయు
స్వచ్ఛమైన మనసు సంబరమ్ము, 
నాదు చరమగీతినందు నిలిచునట్లు
వరమునిమ్ము స్వామి కరుణ తోడ!!!

59

YES, I know, this is nothing but thy love, O beloved of my heart ⎯ this golden light that dances upon the leaves, these idle clouds sailing across the sky, this passing breeze leaving its coolness upon my forehead.

The morning light has flooded my eyes ⎯ this is thy message to my heart. Thy face is bent from above, thy eyes look down on my eyes, and my heart has touched thy feet.

సీ. ఎరుగుదున్ హృదయేశ! ఇదినీదు ప్రేమని!
మరియేమి కాదోయి తరచి చూడ.

బంగారు వర్ణమున్ భాసిల్లి వనములో
తలిరాకు పైయాడి తనియు కాంతి!

ఆకసమ్మున దేలి అలయు మబ్బులగుంపు,
నుదుటిపై చల్లగా కదలు గాలి !

నేటి ఉదయవేళ, కోటిదివ్వెల వెల్గు
కనులలో నింపినీ కబురు దెలిపె!!

ఆ. వంచినావు నీదు వదనమ్ము నాపైన
కనుల గాంచినావు కరుణ తోడ
కరిగిపోతి స్వామి, పరమేది యెరుగకన్
మదిని చేర్చి నీదు పదములందు!!!

60

ON the seashore of endless worlds children meet. The infinite sky is motionless overhead and the restless water is boisterous. On the seashore of endless worlds, the children meet with shouts and dances.

They build their houses with sand and they play with empty shells. With withered leaves they weave their boats and smilingly float them on the vast deep. Children have their play on the seashore of worlds.

They know not how to swim; they know not how to cast nets. Pearl fishers dive for pearls, merchants sail in their ships, while children gather pebbles and scatter them again. They seek not for hidden treasures; they know not how to cast nets.

The sea surges up with laughter and pale gleams the smile of the sea beach. Death-dealing waves sing meaningless ballads to the children, even like a mother while rocking
her baby's cradle. The sea plays with children, and pale gleams the smile of the sea beach.

On the seashore of endless worlds children meet. Tempest roams in the pathless sky, ships get wrecked in the trackless water, death is abroad and children play. On the seashore of endless worlds is the great meeting of children.

సీ. అవధిలేని జగతి నబ్ధితీరమ్మున
కూడిరందరు బాలురాట కొరకు

అంతులేని గగన మచలమై యుండగా
ఉదధిలోని జలము రొదను జేయ

అలుపుసొలుపులేక ఆటపాటలయందు
తేలిపోయిరి వారు వేళ మరచి

మట్టి యిళ్ళను కట్టి మరల మరల కూల్చి
ఆలుచిప్పల తోడ ఆటలాడి

ఎండుటాకు పడవలెగదోసి యలలపై
తేలుచుండ జూచి చాల మురిసి
అవధిలేని జగతి నబ్ధితీరమ్మున
ఆడినారు బాలురాదమరచి

సీ. ముత్యమ్ములకొరకు మున్నీట దుమికేరు
గజయీతగాళ్ళంత గాలమేసి

పయనించి పడవలో బహుదూర దేశాలు
వారాశినేగేరు వణిజులంత

ఈత రాదు, వలను చేతబట్టగలేరు
నీటమునగ లేరు నిధుల కొరకు

కుఱ్ఱలా తీరాన గులకరాళ్ళను దెచ్చి
గుట్టలుగాబోసి, కూలదోసి

ఆ. అరమరికలు లేక ఆడుచుందురు, బాలు
రలసి పోక దుముకు అలల వలెనె
వలలు వేయలేరు జలధిలో నిధులకై
కోరుకొనరు వారు గుప్తరాశి

సీ. ఉబికి నవ్వు కడలి ఉవ్వెత్తునయెగసి
చిరునవ్వుతో ఒడ్డు, మెరసి పోవు

మృత్యుసదృశ అల లత్యంత ప్రేమతో 
వినిపించు జోలను జనని వోలె

గాలివాన కదలు ఘర్జించి గగనాన
మున్నీట నావలు ముక్కలగును

ముంచివేయగ జూచి పొంచిన మృత్యువు
పొంగు కడలి మీద తొంగి జూచు

ఆ. క్రీడలందు దేలి కేరింతల మునిగి
పట్టరాని ముదము పరుగు దీయ
అవధిలేని జగతి నబ్ధితీరమ్మున
కూడిరందరు బాలురాట కొరకు

61

THE sleep that flits on baby's eyes ⎯ does anybody know from where it comes? Yes, there is a rumour that it has its dwelling where, in the fairy village among shadows of the forest dimly lit with glow-worms, there hang two timid buds of enchantment. From there it comes to kiss baby's eyes.

The smile that flickers on baby's lips when he sleeps ⎯ does anybody know where it was born? Yes, there is a rumour that a young pale beam of a crescent moon touched the edge of a vanishing autumn cloud, and there the smile was first born in the dream of a dew-washed morning ⎯ the smile that flickers on baby's lips when he sleeps.

The sweet, soft freshness that blooms on baby's limbs ⎯ does anybody know where it was hidden so long? Yes, when the mother was a young girl it lay pervading her heart in tender and silent mystery of love ⎯ the sweet, soft freshness that has bloomed on baby's limbs.

సీ. పసిపాప కనుదోయి పారాడు నిదురయే
దివినుంచి జారెనో తెలుప గలరె? 

మిణుగురు వెలుగులో మెదులు నీడలమధ్య,
అచ్చెర పల్లెలో అడవి నడుమ,

కదలుచుండెడి రెండు కన్నెమొగ్గలనుండి
వచ్చిచేరెను పాప పసిడి కనుల!!

నిదురించు పాపాయి పెదవిపై చిరునవ్వు
ఎచ్చోట పుట్టెనో ఎరుక గలదె?

ఆ. సన్న కాంతి రేఖ చిన్నిజాబిలినుండి 
శారదాంబుదమును చేరె‌నంట
పిదప మంచు కడుగు ఉదయంపుకల జారి
ముద్దు కూన పెదవి దిద్దెనంట

ఆ. చిట్టి మేనుపైన చిగురించు గంధమ్ము
ఎందు దాగియుండె యిన్నినాళ్ళు?
కన్న తల్లి తాను కన్నెగా ఉన్నపు
డెదను పెంచు ప్రేమ యిదియె నంట!!! 

Posted in November 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!