Menu Close
Kadambam Page Title
ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా...
గవిడి శ్రీనివాస్

కాలం కనుబొమల మీద
అలల్లా  పరిచయాలు కదులుతుంటాయి

కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి
కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి

కృత్రిమ పరిమళాల మధ్య
బంధాలు నలిగిపోతున్నాయి

కొన్ని ఆర్థిక తూకాల్లో
తేలియాడుతుంటాయి

ప్రతి చిరునవ్వు వెనుక
ఒక వినియోగపు ప్రణాళిక పరచుకుంటుంది

అందరం పరాయీకరణ లో
విలవిలలాడుతున్నాం

ఒంటరి పోరాటం లో
అవాంతరాల మధ్య
శక్తి గా వెలగటం
కార్య దీక్షకు సాక్ష్యం పలుకుతుంది

సంతోషం పూయిస్తూ
ప్రయత్నాలు నడిపిస్తూ
ముందుకు ఉరకటమే ఆదర్శం

ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా
కాగే లక్ష్యం మీద
సాగే అడుగుల పరుగులు తీస్తుంటాయి
కలలు సాకారమయ్యే వరకు ...!

Posted in September 2021, కవితలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *