Menu Close
Kadambam Page Title

"అమ్మామృతం"

- డా॥యం. శ్రీరామి రెడ్డి

పల్లవి:
అమ్మ మాటయే అందరి నోట తొలి మాట
అమ్మ పాటయే అన్నిటి కంటే తియ్యటి పాట॥అమ్మ

అనుపల్లవి:
రాముడు కృష్ఞుడు ఈసుడు వ్యాసుడు -
దేవుళ్ళయిన మహాత్ములకు జగన్మాత యే జనని
భగవానల్లా భావ స్వరూపమునకు 
భవ బంధనమే బాంధవ్యపు బాట ॥ అమ్మ

చరణం -1:
ఆకలి వేళల అన్నప్రసాదం అమ్మ
అస్వస్థతలో దివ్యౌషధము అమ్మ
భయాందోళనలో కంఠస్వరము అమ్మ
విషాద వేళల నిషృతి దోహదమే అమ్మ
కన్నీరొలికే శోక సంద్రమున ఒడ్డుకు చేర్చే ఓదార్పే అమ్మ ॥అమ్మ

చరణం-2:
నవమాసాలు కడుపున దాచిన అమ్మ
బ్రూణావయాలకు అణువుల కూర్చిన అమ్మ
జఢత్వానికి జవసత్వాన్నొసగిన అమ్మ
భవితవ్యానికి భవరూపం పొదిగిన అమ్మ ॥ అమ్మ

చరణం-3
ప్రాణానికి ప్రాణం పణంగ పెట్టి ప్రసవించిన అమ్మ
నడిచే దాక చను బాల నైవేధ్యాన్నందించిన అమ్మ
ప్రాణం పోయేవరకు పరమాతి ప్రేమను పంచిన అమ్మ
ప్రత్యక్ష దైవమై ప్రతిక్షణము అభయాన్నిచ్చిన అమ్మ ... అమ్మ॥ 

Posted in May 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!