Menu Close
mg

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై

చిత్రం: మేఘసందేశం (1982)

గేయ రచయిత: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: పి. సుశీల

పల్లవి:
ఆ…ఆ……….ఆ…………
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా ||2||

చరణం:1
గలగలనీ వీచు చిరు గాలిలో కెరటమై ||2||
జలజలనీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా ||2||

చరణం:2
తరులెక్కి ఎల నీలి గిరి నెక్కి మెలమెల్ల ||2||
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీ వెఱ్ఱినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా ||2||

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా

Posted in May 2019, పాటలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!